కృషితోనే విజయం – సోమశేఖర్

రెప్లికా ఆర్టిస్టు గా సుపరిచితులయిన దార్ల నాగేశ్వర రావు గారు హైదరాబాద్ నివాసి. తన కున్న కళాత్రుష్ణ తో వివిధ రంగాలకు చెందిన కళాకారులను కలసి, వారి జీవిత ప్రతిభా విశేషాలు ఈ స్వయం-సందర్శనంలో 64కళలు.కాం పాఠకులకు తెలియజేస్తారు.

తిరువీధుల సోమశేఖర రావు (42), న్యూ మారుతి నగర్, కొత్తపేట, హైదరాబాద్ నివాసి. వృత్తి-ప్రవృత్తి ఆర్టిస్టుగానే జీవనయానంం చేస్తున్నారు.
ఒక ప్రక్కన ఆర్టిస్టుగా ఎన్నో పేయింటింగ్స్ లను చేస్తూనే, బర్తడే, మరియు వివిధ సందర్భాలలో అన్ని రకాల శుభకార్యాలకు “ఈవెంట్ల” కార్యక్రమాలు చేస్తుంటారు. తంజావూర్ పేయింటింగ్స్, వివిధ రకాల పుస్తకాలకు కవర్ డిజైన్లు, కార్టూన్స్, వాల్ డిజైన్స్, మ్యూరల్స్, శిల్పం, ఆయిల్ పేయింటింగ్స్, కాఫిపొడితో పేయింటింగ్స్, పోర్టయిట్స్, ఇంకా క్రాఫ్ట్ పనులు…..ఇలా ఏదైనా, ఏ పనైనా చేయ్యగల సత్తా కలిగిన కళాకారుడు తిరువీధుల సోమశేఖర రావు గారు.


చిలుకూరి బాలాజీ దేవాలయానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలకు ఆర్టిస్టుగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు.
లలిత కళా అకాడమీలో తనకంటూ ఓ స్టాల్ తీసుకుని, ఆర్ట్ క్యాంపులను ఏర్పాటు చేస్తుంటారు. సోమశేఖర రావు గారు 2000 సంవత్సరం నుండి ఆర్ట్ రంగంలో ప్రావీణ్యంతో పాటు, మంచి పట్టు సాధించారు. దానికి తోడు “మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్” లో MFA కూడా పూర్తి చేసారు. గ్రూప్ గాను, సోలోగాను దాదాపు 15 వరకు ప్రదర్శనలు నిర్వహించారు.
కళనే నమ్ముకున్నందుకు ఊపిరి ఉన్నంతవరకు ఆ కళామ తల్లికి సేవలందిస్తానని వారి ఆశయం అన్నారు. ఇకపోతే ఇప్పటికే 500 ల మందికి పైగా ఈ రంగంలో ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇచ్చారు. అవసరమైతే “హోమ్ ట్యూషన్స్” గా ట్రయినింగ్ ఇస్తుంటారు.
చివరిగా “మనం అనుకున్న ఏదైన రంగంలో కష్టపడితే తప్పకుండా విజయాన్ని సాధిస్తామని” అనుభవముతో వెల్లడించారు తిరువీధుల సోమశేఖర రావు గారు.

 

SA: