కైకాలకు కనకాభిషేకం

వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ సినీ షష్టి పూర్తి (1959-2019) సందర్భంగా ఫ్హిబ్రవరి 12న మంగళవారం రాత్రి హైదరాబాదు  వీంద్రభారతిలో ‘కనకాభిషేక మహోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య మాట్లాడుతూ.. కైకాల సత్యనారాయణ వంటి నటులు అరుదుగా ఉంటారని కొనియాడారు. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ.. సినీ రంగంలోనే కాదూ.. రాజకీయ రంగంలో తానేంటో నిరూపించుకున్న గొప్ప మనిషి సత్యనారాయణ అని అన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు స్వాగతం పలికారు. ప్రముఖ నటి జమునారమణారావు, రాజ్యసభ మాజీ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.ఎ.విజయకుమార్, ప్రముఖ సినీ నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, ‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా, డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, అలనాటి నటి గీతాంజలి, రాధాప్రశాంతి మాట్లాడారు. వంశీ సంస్థల అధ్యక్షురాలు డా.తెన్నేటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి శైలజా సుంకరపల్లి పర్యవేక్షించారు. ఈ సభలో తన భార్య నాగేశ్వరమ్మ తో కలసి పాల్గొన్న సత్యనారాయణ జన్మనిచిన తండ్రిని, సాయం చేసిన చేతులను మరచిన వారు మనుషులే కాదన్నారు.   

వ్యక్తిగత జీవితం
సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.

సినీ జీవితం
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఈయన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఈయనకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసారు.

సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.

1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

SA:

View Comments (1)