చదువుల చెలమ

అడవి బాపిరాజు, బుచ్చి బాబు, సంజీవదేవ్, ఆత్మకూరు రామకృష్ణ – వీరంతా కవి చిత్రకారులే. వీరి సరసన చేరిన మధుర కథకులు ఎల్.ఆర్. వెంకట రమణ. ఉపాధ్యాయ వృత్తిలో వుండి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ, ఓర్పుతో తీరిక సమయాన్ని రచనా వ్యాసంగానికి కేటాయించడం వారి నిబద్దతకు నిదర్శనం.
వీరు కళా, సాహిత్య వ్యాసాలు అనేక పత్రికలలో రాసారు. అవన్ని పాటకులను మెప్పించినవే.
ఇప్పుడు “చదువుల చెలమ” పేరుతో 45 కథలను ప్రొదిచేసి తెలుగు పాటకులకు అందించడం ముదావహం. వృత్తి నిజాయితితో కూడినదయితే, ప్రవృత్తి నిబద్దతతో నిండి వుంటుంది. తను కుంచె ద్వారా సప్త వర్ణాలను మిలితం చేసి చిత్ర విచిత్రంగా చిత్రాలను గీసినట్టే, 56 అక్షరాలను అలవోకగా పదాలుగా కూర్చి, వాక్యాలుగా పేర్చి, కథలుగా మాచి విద్యా వికాస కథలుగా చెప్పడం మాములు విషయం కాదు. ఏదైనా చెప్పడం తేలిక. రాయడం కస్టం. ఇలాంటి కస్టతరమైనా కార్యాన్ని సుసాద్యం చేసుకున్నారు వెంకట రమణ.

మనసును అద్యయనం చేయడం చాలా కస్టం. మనసుకు బానిసైన మనిషి మనసు అనే రిమోట్ కంట్రోలుకు లొంగి తన జీవితాన్ని వెళ్ళదీస్తుంటాడు. పిల్ల మనసుకు చవడం ఇంకా కస్టం. పిల్లల మనసు చదవాలంటే రచయిత కూడా పిల్లాడుగా మారాల్సిందే. మనో వైజ్ణానిక దృస్టి కోణంలో విద్యార్దులకు సంబంధించిన విషయాలను కథలుగా మలచడం లో కృత కృత్యులయ్యారు.
తన తండ్రి జైలుగోడల మధ్య మ్రగ్గుతున్నప్పుడు, పంజరంలో పక్షులు కూడా అదేమాదిరి అని – వాటిని విముక్తి కలిగించడం “స్వేచ్చా పుస్తకం” కథ ద్వారా ఆవిష్కరించారు. ఇంట్లో నిరాదరణకు గురవుతున్న అనిత, తాగుబోతు నాన్న చేత దెబ్బలు, – ఇవన్ని భరించలేక చీమల్ని నలిపేస్తుంది. విషయం తెలుసుకున్న తర్వాత గ్రామంలోని పెద్దల సాయంతో తండ్రి ప్రవర్తనలో మార్పు తెచ్చారు. ” చీమలు నన్ను క్షమిచండి” అన్న కథలో ఈ విషయాన్ని చక్కగా మలచారు. నీటి వసతికి, విద్యాభివృద్దికి గల అవినాభావ సంబందాన్ని ” ఆకలి చదువులు” కథ ఆవిష్కరించింది. ఇంకా బామ్మగారి డిగ్రీ, ఎగిరిన పావురం, కర్మయోగి, కొత్తగాలి – ఇలా మొత్తం 45 కథలు ఈ పుస్తకంలో పొందు పరచ బడ్డాయి. విద్యార్దులు అందరూ చదివే విధంగా, వారి మనోవికాసాభివృద్దికి తోడ్పడే విదంగా రాసినందుకు వెంకట రమణ ను అభినందిస్తున్న్నాను.

– తూములూరి రాజేంద్ర ప్రసాద్

SA:

View Comments (2)

  • రాజేంద్రప్రసాద్ గారు మీ విశ్లేషణ బాగుంది. కథలను ఇంకొన్నింటిని పరిచయం చేయాల్సిందని నా అభిప్రాయం. రాయపాటి శివ