“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

2023లో ప్రచురితం అయిన ఈ పుస్తకానికి “డా. సి.భవానీదేవి” గారు ముందుమాట వ్రాస్తూ” రేపటి వాగ్దానం ఈ మానవీయ కవిత్వం”. అన్నారు. ఆచార్య ఎన్.వి.కృష్ణారావు గారు ఆర్తి, ఆవేదన, అనుభూతిని ఆవిష్కరించిన కవిత్వం అన్నారు వారి ముందుమాటలో.
ఈ పుస్తకంలో వున్న 62 కవితలలో కవి సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల్ని తరచితరచి ప్రశ్నలు సంధించారు.

మొదటి కవితలో నే ఎవరురా.. మీరు?
అంటూ దేశ ద్రోహులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవి కుటుంబంలోని సమస్యలు గురించి చెపుతూ తల్లి తండ్రుల ప్రేమ, కష్టం వారిని నిరాదరించడం ఎంత నేరమో ప్రస్తావించారు, “ప్రవహించే జీవనది “కవితలో రాజకీయ సంక్షోభాలు చర్చిస్తూ అపవాదు మబ్బులు తొలగి ఇద్దరు చంద్రులు ఒకటై సకల జన సమ్మత ప్రణాలికలతో ప్రగతి పధంలో పయనించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

“పేగు బంధం” కవితలో తల్లి గొప్పదనం చెప్పారు.” ఎర్రని పాదముద్రలు” కవితలో
కర్కశత్వం కరోనాదే కాదు ఆకలి, దరిద్రాన్ని ది కూడా అంటారు. “కాలంతో పాటు” అనే ప్రధాన
కవితలో కాలంతో పాటు నేను పరిగెడుతున్నాను… అంటూ ఈనాటి మనిషి జీవితం ఎలా పరిస్థితుల తో పాటు పరిగెడుతూ ఉంది చెపుతూ ఆవేదన చెందుతున్నారు.
“తొలకరి” కవితలో రైతుల బాధలు చెపుతూ
“మాయమైన మావి చిగురులు
వసంత గానం మరచిన కోయిలలు “
అంటారు.

“ప్రకృతి ఒడిలోకి” వెళదాం మలయమారుత
వింజామరలతో సేదతీరుదాం రమ్మని పిలుస్తున్నారు.
“ఒంటరిగా” జన సమూహంలో మిగిలిపోయాను నేను అని ఆవేదన పడతారు.
భావితరాల “రేపటి బ్రతుకు చిత్రం” ఎలా ఉంటుందో అని దుఃఖ పడ్డారు.
మూసుకుపోయిన న్యాయం కళ్ళను
తెరిపించే చైతన్య జ్వాలా దీపిక…”అక్షరం”
అంటారు కవి సుభాని.

కవి తన ప్రతి కవితలో కుటుంబ వ్యవస్థ, సమాజంలో వస్తున్న విపరీత ధోరణులు
వలన వచ్చే నష్టాలు, సమస్యలు చర్చిస్తూ మనిషి ని చూడాలి అనే ఓ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కవితా సంపుటి వివిధ పత్రికల్లో పడిన వారి కవితా కదంబం.

శిరిపురపు అన్నపూర్ణ

వెల 150/_లు అయినా అంతకన్నా విలువైన పుస్తకం.
ప్రతులకు: 94907 76184

SA:

View Comments (1)