తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వున్న తెలుగు కార్టూనిస్టులందర్నీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి సమన్వయ పరిచేందుకు, వారి ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, ఆశయాల్ని ఒకరినొకరు పంచుకుంటూ, సామాజిక ప్రయోజనం కల్గిన కార్టూన్లు గీసి, వారిలో ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, కళాసాగర్ తెలియజేశారు.

కొత్త కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం, కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించడం వంటి పలు కార్టూనిస్టుల సంక్షేమ కార్యక్రమాల లక్ష్యంతో అసోసియేషన్ పని చేస్తుందని తెలిపారు. గౌరవాధ్యక్షులుగా  సుప్రసిద్ద కార్టూనిస్టు డా.జయదేవ్, అధ్యక్షులుగా కలిమిశ్రీ, ప్రధాన కార్యదర్శిగా కళాసాగర్, ఉపాద్యక్షులుగా పద్మనాభుని పద్మ, జాయింట్ సెక్రెటరీగా డా.రావెళ్ళ, కోశాధికారిగా చీపురు కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లగా కాజా ప్రసాద్, అనుపోజు అప్పారావు, దేవగుప్తం శ్రీనివాస చక్రవర్తి, ఎం.ఎస్. శాయిబాబు ఎన్నుకోబడ్డారు.
అసోసియేషన్ అధ్యక్షులు కలిమిశ్రీ, ప్రధాన కార్యదర్శి కళాసాగర్ సంఘం లోగోను అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఆవిష్కరణలో ఉపాధ్యక్షులు పద్మ, జాయింట్ సెక్రెటరీ డా. రావెళ్ళ, కోశాధికారి కిరణ్లు పాల్గొన్నారు. సంస్థ ప్రారంభ కార్యక్రమంగా మల్లెతీగ పత్రిక-టి.సి.ఏ. సంయుక్తంగా కార్టూన్ పోటీ నిర్వహించ నుంది.

SA:

View Comments (3)