‘దాసుభాషితం’ తెలుగు యాప్

దాసుభాషితం తెలుగు సంగీత సాహిత్య వేదిక పేరిట Soundcloud లో ఒక ఛానల్ ద్వారా తెలుగు శ్రోతలకు తెలుగు పుస్తకాలను కొండూరు తులసిదాస్ గారు తన గళంలో రికార్డ్ చేసి తెలుగు యాప్ ద్వారా అందిస్తున్నారు.
గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో పుట్టిన కొండూరు తులసిదాస్ గారు . డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక మొదట చదివింది న్యాయ శాస్త్రం, ఆ తరువాత ‘విద్యా శాస్త్రం’.

అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జిల్లా విద్యా శాఖాధికారిగా పనిచేసి 2004 లో ఉద్యోగ విరమణ చేశారు. పుస్తక పఠనం, రచన, అప్పుడప్పుడు సినిమాలు చూడటం, సంగీతం వినడం, అభిరుచులు. తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. తెలుగు స్పష్టంగా మాట్లాడటం వ్యసనం. అలా మాట్లాడే వారి పట్ల ఆరాధనా భావం. హైద్రాబాదుతో దాదాపు 50 ఏళ్ళ అనుబంధం. పదవీ విరమణ తరువాత 2014 నుంచి వీరికి నచ్చిన పుస్తకాలను, ఆ రచయితల అనుమతితో, వీరి గళంలో రికార్డు చేయడం మొదలు పెట్టారు. వాటిని దాసుభాషితం పేరిట Soundcloud,  App లో ఒక ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలకి ప్రపంచం నలుమూల్లో ఉన్న తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. ఆ కార్యక్రమాలకి ప్రపంచం నలుమూల్లో ఉన్న తెలుగు వారి నుంచి విశేష స్పందన అందింది. అలా మొదలు పెట్టిన రెండేళ్లలోనే, ‘దాసుభాషితా’నికి ప్రపంచ వ్యాప్తంగా లక్ష్ పైచిలుకు శ్రవణాలు నమోదైయ్యాయి. చాలా మంది శ్రోతలు కార్యక్రమాలను వినటమే కాకుండా, ఇమెయిల్, ఫోన్ ద్వారానో లేక స్వయంగానో వీరిని అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు దాసుభాషితం లో అందించిన నవలలు పాకుడురాళ్ళు, మరపురాని మేరీ, సశేషం, గాందర్వం. మిథునం, అమరావతి కథలు, దక్షిణ కాశి లాంటి కథల పుస్తకాలు. యెస్.పి శైలజ తో ముఖాముఖి వున్నాయి. ముఖ్యంగా వెయ్యి పేజీలున్న పాకుడురాళ్ళు నవలను 54 భాగాలుగా అత్యద్భుతంగా వినిపించారు. ఇంకెందుకు ఆలశ్యం మీరూ దాసుభాషితం యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వినండి…  ఇంతటి బృహత్కార్యానికి వీరి కుటుంబ సభ్యుల సహకారం వుండ బట్టే చేయగలిగారు. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని 64కళలు పత్రిక ఆశిస్తున్నది. 

SA:

View Comments (2)