విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచం సరిహద్దులు చెరిగిపోయి, భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. యూట్యూబ్ ప్రవేశం తో ఇది మరింత మందికి చేరువైంది. యూట్యూబ్ కేవలం సినిమాలు, రాజకీయాలే కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, విద్యార్దులకే కాకుండా ఔ త్సాహికులకు ఎంతో ప్రయోజనకరంగా అవతరించింది. నాడు తరగతి గదుల్లోనూ, పుస్తకాలు చదివి నేర్చుకొనే విద్యలనేకం నేడు -టెక్ గురూ ల పుణ్యమా అని సాఫ్ట్వేర్ కోర్సులు , వ్యాయామం, వంటలు, సంగీతం, నృత్యం , యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్, జ్యోతిష్యం, పిల్లల రైంస్, ఆటలు,  ఆరోగ్యం వంటి సమస్త విషయాలపై అవగాహన కలగడానికి, నేర్చుకోవడానికి, ప్రావీణ్యము సంపాదించడానికి యూట్యూబ్ సహాయపడుతుంది. ప్రచురణ రంగంలోనూ, వీడియో సి.డి.ల రూపకల్పనలోనూ పేరొందిన విశ్వఇన్ఫోటెక్ వారు ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్ను ప్రారంభించారు. ఇందులో పైన పేర్కొన్న అన్ని రంగాలకు సంభందించిన వీడియోలు ‘తెలుగు ‘ లో లభ్యమవుతాయి. కింద లింక్ ద్వారా మీరూ  ఒక లుక్కేయండి. https://www.youtube.com/user/viswaainfo

SA:

View Comments (1)