వెన్నెలకంటి కి ‘నాగభైరవ ‘ పురస్కారం ..

ఆదివారం (18.08.2019 ) ఉదయం ఒంగోలు యన్.టి.ఆర్.కళాక్షేత్రంలో నాగభైరవ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో డా.నాగభైరవ పేరిట పురస్కార ప్రదానోత్సవం జరిగింది.సభకు డా.నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించగా,కళామిత్ర మండలి తెలుగు లోగిలి జాతీయ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు సభా నిర్వహణ గావించారు.ఈసందర్భగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, నాగభైరవ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం సభాధ్యక్షులు డా. నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ తెలుగు సాహితీవనంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆయన పేరుతో ఎందుకు పురస్కారం ఏర్పాటు చేశారో ఆవివరాలను సభకు తెలియజేశారు. ఆ తర్వాత ముఖ్య అతిథిగా హాజరైన యన్.టి.ఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, ఆత్మీయ అతిథులు నల్లూరి వెంకటేశ్వర్లు, సినీ సంభాషణల రచయిత పి. రాజేంద్ర కుమార్ నాగభైరవ కోటేశ్వరరావు తో ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ ఎదలోతుల్ని కదిలించే కథనాలతో కావ్యాలను రచించారని తెలిపారు. పురస్కార గ్రహీతల వెన్నెలకంటి, మందరపు హైమావతి గురించి శ్రీమతి తేళ్ల అరుణ సభకు పరిచయం చేసారు.

SA: