విజయవాడలో ‘అమరావతి పొయటిక్ ప్రిజం ‘

అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం – సమసమాజ స్థాపనే కవిత్వ లక్ష్యం 

కవితాఝరితా సృజ నకు పట్టం కట్టాలనే సంకల్పంతో గత ఐదేళ్లగా తమ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బహుభాషా కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ‘అమరావతి పొయెటిక్ ప్రిజమ్’ పేరిట శనివారం అంతర్జాతీయ కవి సమ్మేళనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి ఎంతో మంది కవులు తమ సొంత ఖర్చు లతో సమ్మేళనానికి హాజరు కావడం కవిత గొప్ప తనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలకు చెందిన 761 మంది కవులు 125 భాషల్లో అందిం చిన 1303 కవితలతో సంపుటిని రూపొందించామని తెలిపారు. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న కవులను ఆహ్వానిం చడంలో కల్చరల్ సెంటర్ గౌరవ సలహాదారు పద్మజా అయ్యంగార్, సెంటర్ సీఈవో డాక్టర ఈమని శివనాగిరెడ్డి ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు.

సమాజంలోని రుగ్మతల్ని పారదోలేందుకు ప్రాచీన కాలం నుంచి కవులు ఎంతో పాటుపడ్డారని, సమ సమాజ స్థాపనే కవిత్వం లక్ష్యం కావాలని జ్ఞానపీర్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ సీతా కాంత్ మహాపాత్ర అన్నారు. మాలక్ష్మి, రాష్ట్ర పర్యటక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి సమితి, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీఆర్డీఏ, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ‘అమరావతి బహుభాషా కవి సమ్మేళనం -2019’ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతాకాంత్ మహాపాత్ర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కవులందరినీ ఒక చోట చేర్చి కవితా సమ్మే ళనం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ప్రపంచంలో నెలకొన్న అస్తవ్యస్త రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను కవులు తమ కవితల ద్వారా వెల్లడించడానికి ప్రయత్నం చేశారని చెప్పారు. కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ స్థానిక సమస్యలు, ప్రజా జీవితం కవితల్లో ప్రతిఫలించాలని సూచించారు. భాషపై పట్టున్నప్పుడే సమర్ధ కవిత్వం పుట్టుకొస్తుందన్నారు. అన్యాయ పోకడలను ధైర్యంగా ఎత్తి చూపేది కవిత్వం ఒక్కటేనని గుజరాత్ సాహిత్య అకాడమీ అధ్య క్షులు, పద్మశ్రీ విష్ణు పాండ్య పేర్కొన్నారు. రోజురోజుకూ పతనమవుతున్న విలువలను కాపాడే శక్తి కవిత్వానికే ఉందని సీనియర్ తమిళ కవి రాజారాం రాంచంద్రం విశ్లేషించారు. ప్రముఖ కవయిత్రి, సమ్మేళనం సమన్వ యకర్త పద్మజా అయ్యంగార్, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర ఈమని శివనాగిరెడ్డి మాట్లా డుతూ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన కవులకు కృతజ్ఞతలు తెలిపారు. కవిసమ్మేళనంలో ఒడిశా కవి సీతాకాంత్ మహాపాత్ర తమ మాతృభాషలో కవితను వినిపించారు. వృద్దా ప్యంలో తండ్రి పట్ల కుటుంబీకులు వ్యవహరిస్తున్న శైలిని ఉదహరిస్తూ తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి గోపి కవిత ఆలోచింపచేసింది. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తన తండ్రిపై రాసిన కవిత అందరినీ కంటతడి పెట్టిం చింది. కిల్లాడ సత్యనారాయణ, విప్పగుంట రాం మనోహర, డాక్టర్ వెన్నా వల్లభరావు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను చదివి వినిపించారు. సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనృసింహం, మాలక్ష్మి ప్రాపర్టీస్ సీఈవో సందీప్ మండవ, మాలక్ష్మి సంస్థల చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలనుండి సుమారు 35 మంది కవులు తమకవితలను వినిపించారు.

SA: