సత్యహరిశ్చంద్ర నాటక పద్యపఠన పోటీలు

(డిసెంబర్ 23న నందిగామలో సత్యహరిశ్చంద్ర నాటక పద్యాల పోటీలు)

Balijepalli

బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. నిత్య సత్యవంతుడు హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట రాశారు. ఈ నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు పాత్రలను లక్ష్మీకాంతమే పోషించారు. ఇందలి పద్య రచన ఒక జలపాతం. పండిత, పామరుల్ని అలరింప జేశాయి.

డిసెంబర్ 23వ తేదీ సత్యహరిశ్చంద్ర నాటక రచయిత కీర్తిశేషులు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి 141 వ జయంతి ఈ జయంతి మహోత్సవం సందర్భంగా 23-12-2022 నాడు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బొబ్బిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారి ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ కళాసమితి వారు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్ర నాటక పద్యపఠన పోటీలు నిర్వహిస్తున్నారు.

ఎంట్రీ ఫీజులు లేవు బహుమతులు మొదటి బహుమతి- రూ.3000, రెండవ బహుమతి – రూ. 2500, మూడవ బహుమతులు2, – రూ.1000 ఇంకా… ఎంతో ప్రతిష్టాత్మకమైన బళ్ళారి రాఘవ కళాసమితి వారి ప్రశంసా పత్రాలు….
వేదిక బళ్లారి రాఘవ కళాసమితి నందిగామ, ఎన్టీఆర్ జిల్లా సమయం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం…. పాల్గొనదలచిన వారు 22వ తారీకు లోపు గానే క్రింది ఫోన్ నెంబర్ లో మీ పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవాలి.
నంబర్: 9949395816

SA: