హైదరాబాద్ లో 8న కార్టూన్ ఫెస్టివల్

ఆరుగురు కార్టూనిస్టులకు పురస్కారాలు

చత్తీస్ ఘడ్ (రాయపూర్)కు చెందిన కార్టూన్ వాచ్ 24 సంవత్సరాలుగా వెలువడుతున్న కార్టూన్ మాస పత్రిక. ఈ పత్రిక ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ నగరంలో కార్టూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కార్టూనిస్ట్ త్రయంబక్ శర్మ తెలిపారు. ఆరుగురు ప్రముఖ కార్టూనిస్టులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. పార్క్ హోటల్ లో 8న సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న ఈ ఫెస్టివల్ లో సీనియర్ కార్టూనిస్టులు జయదేవ్ బాబు, ఎం.ఎస్. రామకృష్ణ, దివంగత మోహన్ లకు 2019 సంవత్సరానికి, నర్సిమ్, శంకర్, మృత్యుంజయ్ లకు 2020 సంవత్సరానికి పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ నిర్వాహకుల పక్షాన త్రయంబక్ శర్మ మాట్లాడుతూ నగరంలో కార్టూన్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఎన్ఎండీసీ, చత్తీస్ ఘడ్ సాంస్కృ తిక శాఖలు సహకరిసున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్టూన్ వాచ్ 2016లో నిర్వహించిన కార్యక్రమంలో సుప్రసిద్ధ కార్టూనిస్టు సుభాని అప్పటి చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్ చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

SA: