కొలువుదీరిన ప్రపంచ దేశాల కరెన్సీ

అంతర్జాతీయ నాణేలు, నోట్ల ప్రదర్శన విజయవాడలో…

కాలచక్రం కళ్లెదుటే గిర్రున వెనక్కి తిరుగుతుంది. 2000 నోట్లను చూస్తున్న కాలం నుంచి రాగి నాణేల రాజుల కాలంలో నడుస్తాం. ఇక్కడ రాజుల కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఏ కాలం లో ఏ నాణేలు చలామణిలో వున్నాయో చూడవచ్చు నవాబుల పాలన కాలం నుంచి ఇండియన్ రిపబ్లిక్ వరకు నాణేలు, కరెన్సీ నోట్లు చూపిస్తున్నారు విజయవాడలో. దేశవిదేశాల్లో ముద్రించిన చలామణి అయిన నూతనంగా ముద్రించిన నాణేలు, నోట్లు మన కళ్లెదుటే ఉంచారు.

విజయవాడ, సూర్యారావుపేటలో మూడు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ నాణేల ప్రదర్శన శుక్రవారం (6-9-2019)న ప్రారంభమైంది సుమారు 22 స్టాల్స్ లో ఏడు రాస్ట్రాలకు చెందిన సేకరణ దారులు తమ కలెక్షన్ ప్రదర్శిస్తున్నారు. అణా దగ్గర నుంచి పైసా వరకు, రూపాయి నోటు నుంచి రెండు వేల రూపాయల నోటు వరకు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. మొగలుల, సుల్తానుల కాలంలో చలామణి అయిన నాణేలు, మద్రాసు ప్రెసిడెన్సీ లో తెలుగులో ముద్రించిన తొలి నిజాం సంస్థానంలో నాటి చరిత్రను చక్కగా వివరిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ నోటు, అతి చిన్న కరెన్సీ నోటు ఆసక్తిని కలిగిస్తున్నాయి.   ఏర్పాటు చేసిన నోట్లు నాణేల ప్రదర్శన. ఇలా ఎన్నెన్నో అద్భుతాలకు వేదిక అయింది. విజయవాడ సూర్యరావుపేట లోని శ్రీధర్ సీసీఈ ఏర్పాటు చేసిన నోట్లు నాణేల ప్రదర్శన. Vijayawada Numismatic and Philatelic Association ఆధ్వర్యంలో ఆగస్ట్ 6, 7 మరియు 8 తేదీల్లో నిర్వహించే ఈ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.  ముఖ్యంగా పిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

ఫ్యాన్సీ కరెన్సీ : సంఖ్యాబలం, సెంటిమెంటు చాలా మందిలో కనిపిస్తుంది. అదృష్ట సంఖ్య ఉండే తేదీల్లో కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు. వాహనాలు కొనేవాళ్ళు అదృష్ట సంఖ్యలు ఉండే నెంబర్ కావాలని కోరుకుంటారు. మరికొంత మంది తమ పుట్టిన రోజు, పెళ్ళి రోజు సంఖ్యలు వుండే నోట్లు సేకరిస్తారు. ఇలా ఫ్యాన్సీ నెంబర్లు ఉన్న కరెన్సీ నోట్లను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు కొందరు ఇక్కడ. విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నాణేలు కరెన్సీ నోట్ల ప్రదర్శనలో ఫ్యాన్సీ కరెన్సీ అందరిని కట్టిపడేస్తుంది. మీ పుట్టిన తేదీ ఇతర సంఖ్యలు వచ్చేటట్లుగా 10, 20 రూపాయల కరెన్సీ నోట్లను ఈ ప్రదర్శనలో అందిస్తున్నారు. అయితే నోటు ఖరీదుకు నాలుగు రెట్లు ఎక్కువగా తీసుకొంటున్నారు. మన పుట్టిన రోజు తేదీ కలిసి వచ్చేలా పది రూపాయలు నోటు కావాలంటే 50 రూపాయలు తీసుకుంటున్నారు.

SA: