‘గోతెలుగు ‘ ను అందుకే ప్రారంభించా – బన్ను

పాతికేళ్ళుగా పత్రికలలో కార్టూన్లు గీస్తున్న” బన్ను” గారి కార్టూన్ ప్రస్థానం ఈ నెల ‘ మన కార్టూనిస్టులు ‘ శీర్షిక లో తెలుసుకుందాం.
బన్ను పేరుతో కార్టూన్స్ వేసే నా అసలు పేరు పాలచర్ల శ్రీనివాసు. పుట్టింది 29 జనవరి 1969, రాజమండ్రి లో. అమ్మ సత్యవతి, నాన్న లేటు నారయ్య. నాగపూర్లో ఇంజనీరింగ్ చదువుకొని, హైదరాబాదు లో ఉద్యోగం చేసి, ప్రస్తుతం సింగపూర్ లో వ్యాపారం చేస్తున్నాను.
నాకున్న వీక్నెస్ ‘హాస్యం’ అతిచిన్న వయసు నుంచి కార్టూన్స్ వేయడం ప్రారంభించాను. ఎలా గీయాలో తెలియక కాగితంపై పెన్సిల్ తో గీసి పంపిస్తే అన్నీ తిరిగొచ్చేవి. అప్పట్లో జయదేవ్ గారి సలహాలు తీసుకుని (పోస్టల్ లో ) ఏకలవ్య శిష్యరికం చేసి కార్టూన్ నేర్చుకున్నాను. మొట్టమొదటి కార్టూన్ 1983లో “హాస్యప్రియ”లో వచ్చింది. తర్వాత దాదాపు అన్ని వార, మాస, పత్రికల్లోనూ వేలాది కార్టూన్లు ప్రచురించబడ్డాయి. తర్వాత కొంత విరామం తర్వాత మళ్ళీ ఇంటర్ నెట్లో మొదలుపెట్టాను. ఇంగ్లీష్, తమిళ్ లో కార్టూన్స్ ప్రచురింప బడటం చాలా ఆనందాన్నిచ్చింది. కార్టూన్లపోటీల్లో కొన్ని బహుమతులు గెల్చుకున్నాను. కార్టూనిస్టులకు ప్రాధాన్యత కల్పిస్తూ ‘గోతెలుగు.కామ్’ అనే వార పత్రికను వెబ్లో రెగులర్ గా కొనసాగిస్తున్నాను. నవ్వు నాలుగు విధాల చేటు కాదు, “స్వీటు’ అని నమ్ముతాను, నమ్మిస్తాను.
” చురక ” శీర్హిక లో ప్రతీ వారం సినిమా రంగం పై నేను వేస్తున్న ఫోటో కార్టూన్స్ పాఠకుల విశేష ఆదరణ పొందాయి.
ఇటీవలే “గోతెలుగు డాట్ కామ్” కు వెబ్ పత్రికకు “ఇండివుడ్” అంతర్జాతీయ అవార్డు రావడం సంతోషకరం. ఇందుకు గాను నాకు అన్ని విదాలుగా సహకరిస్తున్న రచయితలకు, కార్టూనిస్టులకు, మా గోతెలుగు స్టాఫ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 64 కళలు పత్రిక ద్వారా నన్ను పాఠకులకు పరిచయం చేస్తున్న కళాసాగర్ గారికి థాంక్స్.

-బన్ను

SA:

View Comments (11)

  • Happy to about Bannu garu. I am very much thankful to Bannu garu for a continuous encouragement being given to me along with other cartoonists. Running successfully gotelugu magazine punctually without a break with user-friendly comment boxes against every feature is a great thing. He deserves the award. Congratulations to Bannu garu and gotelugu team.

  • బన్నుగారు తన గురించి ఎన్నో విషయాలు చెప్పారు.
    కార్టూన్స్ చాలా బావున్నాయి. బన్నుగారికి ధన్యవాదాలు.
    "64కళలు" కొత్త సొగసులతో నయనానందకరంగా తీర్చిదిద్దారు.
    వీక్షకుల అభిప్రాయాలు తెలియజెప్పేందుకు చాలా బాగుంది.
    మిత్రులు కళాసాగర్ గారు చేస్తున్న ఈ కళాసాగర మథనానికి నా అభినందనలు !

  • వెరీ గుడ్ సర్ ...కార్టూనిస్టుగా మీరు సాధించిన విజయాలకు అభినందిస్తూ...మీరు మరెన్నొ విజయాలు సాధించాలని కొరుకుంటూ...మీ యువరాజ్