‘తెలంగాణ విమోచన దినోత్సవ’ చిత్రకళా ప్రదర్శన

భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17, 2022న “హైదరాబాద్ విమోచన దినోత్సవం” జరుపుకుంటుంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏడాది పొడవునా జరుపుకోవడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. భారతదేశంలోని ప్రస్తుత తరంలో త్యాగం, వీరత్వం మరియు ప్రతిఘటన యొక్క కథపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా 50 మంది చిత్రకారులతో ఆర్ట్ క్యాంప్ (ఆన్‌లైన్) 8-9-2022 మధ్యాహ్నం 3 గంటలకు సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రారంభించారు. లలిత కళా అకాడెమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆర్ట్ క్యాంపును సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి ప్రారంభించారు.

Artists work at canvas

హైదరాబాద్ విమోచనం, తెలంగాణ సంస్కృతిపై కళాకారులు చిత్రించిన 50 చిత్రాలతో ఎగ్జిబిషన్‌ను సెప్టెంబర్ 14వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ తో పాటు లలిత కళా అకాడెమీ చైర్ మేన్ శ్రీమతి ఉమా నండూరి కూడా పాల్గొన్నారు. ఈ నెల 17 న జరగబోయే కార్యక్రమానికి అమిత్ షా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇదే ప్రదర్శనను హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంకు తరలించనున్నారు.

టైలర్ శ్రీనివాస్, కప్పరి కిషన్, శేష బ్రహ్మాం, పద్మా రెడ్డి, బైరు రఘురాం, జి. ప్రమోద్ రెడ్డి, బొత్చా భాస్కర్, చిత్ర, అన్నపూర్ణ, పి.జె. స్టాలిన్, గుర్రం మల్లేశం, భూషయ్య, సుంకోజు రమేష్, మధు కురువ, కుమార స్వామి, బాల భక్తరాజు, డి.వి.ఎస్. కృష్ణ తదితర చిత్రకారులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు, లలిత కళా అకాడెమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ రమణారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆర్ట్ క్యాంప్ లో పాల్గొన్న చిత్రకారులందరూ తెలంగాణ విమోచన కోసం ఆనాటి పోరాట యోధులను, పోరాట నేపథ్యాన్ని తమ చిత్రాలలో ఆవిష్కరించారు.

కళాసాగర్ (9885289995)

Art show Inauguration by Telangana Governor
Kappari Kishan, Promod Reddy and Bhooshayya art works
Telangana Liberation Day Art Works
Tailor Srinivas, Sesha Brahmam
A.N. Pushpavathi and Ramesh Sunkoju art works
SA:

View Comments (2)