నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం…

అమ్మను పూజించండి… భార్యను ప్రేమించండి… సోదరిని దీవించండి. ముఖ్యంగా మహిళల ప్రాధాన్యతను గుర్తించండి.

ఆదివారం (08-03-2020) నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది మహిళలకు దక్కవలసిన ఆర్ధిక, రాజకీయ, సామాజిక గుర్తింపును గుర్తుచేసే ఉత్సవం లాంటిది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులను అరికట్టే కార్యాచరణకు ప్రభుత్వం నడుంబిగించాలని, వాటి నివారణ చర్యలమీద ఎటువంటి జాప్యం చేయరాదని మహిళా సంఘాలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఒక వేడుకగా నిర్వహించడం కాదు … స్వేచ్ఛాయుత వాతావరణంలో మహిళలు మనుగడ సాగించే రోజులు రావాలని ప్రతినబూనే రోజుగా ఈ ఆదివారాన్ని పరిగణించాలి.. ఈ సందర్భంగా ప్రతి పురుషుడూ మహిళలకు శుభాకాంక్షలు తెలుపండి. ‘’కార్యేషు దాసి…కరణేశు మంత్రి…భోజ్యేషు మాత’’ అనే ఆర్యోక్తిని ప్రతి పురుషుడు గుర్తు చేసుకోవాలి. స్త్రీ లేకుంటే జననమే లేదు…. మహిళలు లేనిదే సృష్టిలో జీవం వుండదు. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు వుంటారనే నానుడి ని పురుషులు మరచిపోకండి.

స్త్రీమూర్తిని గౌరవిద్దాం… సమాజాన్ని కాపాడుకుందాం…

SA: