కనువిందు చేసిన చిత్రకళాప్రదర్శన

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకుని 26 వ తేదీన జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాసంబరాలులో భాగంగా అరవ రోజు గురువారం విజయవాడ ఎం.బి. విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన చిత్రకళాప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుడు మోహన్ సంస్మరణార్థం ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన ప్రజా జీవనానికి అద్దం పట్టింది. ప్రముఖ సీనియర్ చిత్రకారులు జింకా రామారావు ప్రారంభించిన ఈ ప్రదర్శనలో ప్రకృతి అందాలు, గ్రామీణ జీవనం, పర్యావరణం తదితర అంశాల్లో రూపొందించిన సుమారు 30 మంది చిత్రకారుల చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా జాషువా సాంస్కృతిక బాధ్యులు ఎ.సునీల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వక్తలు ప్రసంగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసిద్ధ ఛాయాచిత్రగ్రాహకులు టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొండవీడు మీద తాను ఒక డాక్యుమెంటరీ తీస్తున్నట్లు చెప్పారు. దాని కోసం కొన్ని చిత్రాలను సేకరిస్తున్నాని తెలిపారు. జాషువా కుమార్తె హేమలతా లవణం తనను ఫోటోగ్రాఫర్గా తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. అలాగే చికాగోలో ఫోటో ఆర్ట్స్ ను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారని చెప్పారు. కొత్త వాళ్లు ఈ రంగంలోకి రావాలని కోరారు. అంతర్జాతీయ ధ్వనిఅనుకరణ కళాకారులకు సిల్వెస్టర్ మాట్లాడుతూ అద్భుతమై ప్రక్రియ ఆర్ట్స్ అన్నారు. అణగారిన వర్గాల కోసం గుర్రం జాషువా గబ్బిలం రచన చేశారని పేర్కొన్నారు. కళలు అనేవి కృషి చేస్తే వస్తాయన్నారు. జింకా రామారావు మాట్లాడుతూ చిత్రకళల్లో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కొండడపల్లి మాధవరావు జాషువా పద్యాలు ఆలపించి సభికులను అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్టూనిస్ట్ గంగాధర్ వీర్ల, ప్రముఖ చిత్రకారులు అరసవిల్లి గిరిధర్, గాంధీ జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి, గుండు నారాయణ, డి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 28 వరకు (మూడు రోజుల పాటు) జరిగే ఈ ప్రదర్శనలో జింకా రామారావు, అరసవిల్లి గిరిధర్, సునీల్ కుమార్, గంగాధర్, ప్రసాద్, మహారాణా, గంగాభవాని అల్లు, కాంతారావు మజ్జి, కొలుసు సుబ్రమణ్యం, మధు, ప్రశాంత్, ముత్యాల సుధారాణి, ఎన్. శ్రీధర్, అత్మకూరి రామకృష్ణ, నాగ ప్రసాద్, వై. రామకృష్ణ, ఎన్. రవిబాబు, రవికుమార్ రెడ్డి, జెల్లి రేష్మ, రియాజ్ భాషా, సన్నాల, పి. శ్రీనివాస్, ఆలమూరి శ్రీనివాస్, టీవీ, వెంకటేష్, వేణుగోపాల రావు, కమతం గాంధీ, పట్నాల శ్రీధర్ లు పాల్గొన్నారు.

SA:

View Comments (2)