కొండపల్లి కోటలో గుడిసంబరాలు

కొండపల్లి ఖిల్లా లో పురావస్తు శాఖ – పరంపర సంస్థ ఆధ్వర్యంలో అనుభవ నృత్య రూపకం

కొండపల్లి ఖిల్లా లో పురావస్తు శాఖ – పరంపర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడిసంబరాల కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు,ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి. కృష్ణమోహన్, ఎం.ఎల్.ఎ. లు వసంత కృష్ణ ప్రసాద్, మల్లాది విష్ణు, పురావస్తు శాఖ కమిషనర్ వాణి మోహన్ ,లక్ష్మీ సజ్జల రామకృష్ణారెడ్డిపలువురు క్ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి 9-01-2020, గురువారం సాయంత్రం ప్రారంభించారు.
ముందుగా కొండపల్లి చరిత్ర ను తెలుపుతూ ప్రదర్శించిన లేసర్ షో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. అనంతరం లీలా శాంసన్ బృందం ప్రదర్శించిన అనుభవ నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా కళాకారులకు కొండపల్లి బొమ్మలు ఇచ్చి సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పరంపర సంస్థ డైరెక్టర్ శ్రీనాగిరెడ్డి, IAS అధికారులు రేఖా రాణి, సునీత, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లి చరిత్ర…
కొండపల్లి కృష్ణాజిల్లాలో చేరిన బెజవాడ తాలూకా యందలి దుర్గారణ్య స్థలము. ఇది గొప్ప పర్వతము. దక్షిణం కృష్ణానది వరకును, ఉత్తరం కొండూరు, జుజ్జూరు వరకును వ్యాపించినది. దీని చుట్టు కొలత 100 మైళ్ళు. యీ పర్వత రాజమున ప్రతి సంవత్సరము శీతాఫలములు, కుంకుళ్లు, రేగుపండ్లు మొదలగునవి ఫలించును. కంప, కట్టె, పచ్చిక వగైరాల మీద ప్రభుత్వము వారికి ఆదాయము వస్తుంది. ఈ కొండ పైన చిరుతపులులు, పెద్దపులులు మొదలగు క్రూరమృగముల భయమున్ను అప్పుడప్పుడు చోరభయమున్ను యుండును. కొండయెత్తు సుమారు 2 మైళ్ళు వుంటుంది.
కొండపల్లిలో బొమ్మలు రకరకములుగా అనాది నుంచి తయారు చేయుచున్న ఆర్య క్షత్రియ కుటుంబములు సుమారు 50 గలవు. వీరి శిల్ప చాతుర్యము వర్ణనాతీతము. అనాది నుండి యీ గ్రామము చేతి పరిశ్రమలకు నిలయమే. చాల కాలము కొండపల్లి కాగిత పరిశ్రమకు ఆధిక్యము కలిగి వాడుకలో ఉండెడిది. ఆ కాగితపు పరిశ్రమ యిప్పుడు కానరాదు. ప్రస్తుత మీ గ్రామమందు ఒక మాధ్యమిక పాఠశాలయు, కీ.శే. బొల్లారెడ్డి కోటిరెడ్డి జమిందారుగారి ధర్మసత్రమును, గుంటక నర్సారెడ్డిగారిచే నిర్మింపబడిన కోటిరెడ్డి మెమోరియల్ క్లబ్బును వున్నవి. జన సంఖ్య 5000. పంచాయితీ బోర్డు, పంచాయితీ కోర్టు కూడా గలవు. రెడ్డిరాజులచే నిర్మింపబడిన ప్రాచీన శివాలయము, వీరభద్రాలయము ఆంధ్రులనాకర్షించుచున్నవి. మహమ్మదీయుల పండుగలు జరుపుటకు గవ్వలగట్టను చిన్న గుట్ట కలదు. గుట్ట వెనుక భాగమున విద్యాధరగజపతి వారి చెరువు కలదు.

SA: