ప్రజల మనిషి కామ్రేడ్ లెనిన్

లెనిన్ 150 జయంతి సందర్భంగా…
20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. లెనిన్ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా ‘బోల్షెవిస్ట్ రష్యా’ దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజమ్ లేదా మార్క్స్సిజమ్-లెనినిజమ్ అని అంటారు. ఏప్రిల్ 22, 1870 న పుట్టిన లెనిన్ 150 జయంతి సంవత్సరం ఇది.

ప్రజల మనిషి లెనిన్

“లెనిన్” రెండున్నర అక్షరాలే
కోట్ల గుండెల్లో మార్పు పోరు విద్యుత్తును పుట్టించిన మానవ యంత్రం
ప్రజల బతుకుల్లో కమ్ముకున్న చీకట్లను-వేదనలను-హింసను-అణచివేతను
రూపుమాపి సమసమాజం నెలకొల్పిన ప్రజలమనిషి
ప్రజా సిద్ధాంత రూపకర్త
సోషలిస్టు సమాజానికి రూపు రేఖలు దిద్దిన సమాజ గణిత శాస్త్రవేత్త
తాడిత పీడిత బతుకు చీకట్లను
తుఫానులను తొలగించుకునే
ధైర్యమి చ్చిన పోరు సూర్యుడు
లెనిన్ నిన్నటి పేరు కాదు
మొన్నటి పేరు కాదు
ఈనాటి పేరూకాదు
తద్ధర్మార్థక నామవాచకం
మనిషి భూమిపై ఉన్నంత కాలం
గుండెల్లో ఆత్మవిశ్వాసం పండించే పేరు
నివురుగప్పిన నిప్పులా ప్రజల గుండెల్లో ఉండిపోయిన
ధైర్యాన్ని తట్టిలేపి
విప్లవాన్ని నడిపించిన రక్తక్షారాలు లెనిన్
సోషలిజం వస్తదా?
చస్తదా? అన్న
పెట్టుబడిదారీ గూండాయిజానికి
సోషలిజం రాకను
ఎదుగుదలను
స్థిరత్వాన్ని
అభివృద్ధిని
కళ్ళకు కట్టించిన
సరికొత్త దార్శనికుడు
అతడే లెనిన్-లెనిన్-లెనిన్

-వల్లభాపురం

SA: