వినూత్నంగా కవిత్వంతో ఒక సాయంకాలం

విజయవాడ సాహితీమిత్రులు సరి కొత్త ప్రయోగం …

ప్రకృతి మానవ మనుగడపై ప్రశ్నలెక్కుపెట్టిన సందర్భం విధ్వంసం – చెట్టు విధ్వంసం, పిట్ట విధ్వంసం, నీరు విధ్వంసం, నేల విధ్వంసం, మనిషి విధ్వంసం ఈ విధ్వంసాల నేపథ్యంలో మనిషి అన్నింటిమీదా పట్టుసాధించానని విర్రవీగుతున్న సందర్భం. సాధించినదేదీ మనది కాదని మనల్ని మనమే ధ్వంసం చేసుకోవడమే మనం సాధించినదనీ తెలుసుకోవాల్సిన సందర్భం నిజంగానే నడిచొచ్చిన దారుల్ని వెనుదిరిగి పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇటువంటి సందర్భంలో కూడా మనతో నడిచొచ్చేది మనతో కలిసుండేది కవిత్వమే ఆ కవిత్వంతో మళ్లీ ఒకసారి కలుద్దాం అంటున్నారు విజయవాడ సాహితీమిత్రులు.
భౌతికంగా ఒకరికి ఒకరం, దూరంగా ఉన్నప్పటికీ విజయవాడ సాహితీమిత్రులు కవిత్వంతో మనల్ని దగ్గర చేసేందుకు పూనుకొన్నది గత రెండు దశాబ్దాలుగా విజయవాడలో ‘మే 1’ సాయంత్రాలు కవిత్వంతో సేద తీరుతున్నాయి.
అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ‘మే 1’ న వినూత్నంగా కవిత్వంతో ఒక సాయంకాలం జరుగనుంది.
అది ఎలా అంటే ‘జూమ్ యాప్ ‘ ద్వారా నెరవేరనుంది.

SA: