పేరులోనూ … తీరులోనూ … చిరంజీవే….

మెగాస్టార్ చిరంజీవికి 65 వ పుట్టినరోజు శుభాకాంక్షలు….

ఒక వ్యక్తి పుట్టినరోజు – అతనికి.. అతని కుటుంబానికి ఆనందం కలిగించడం సహజం. కొన్ని కొన్ని సార్లు బంధువులు..మిత్రులు..ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు. కాని కోట్లాది మంది ఆ వ్యక్తి పుట్టినరోజుని తలుచుకుంటున్నారంటే.. నిండు నూరేళ్ళు బాగుండాలని ప్రార్థిస్తున్నారంటే. ఆ వ్యక్తి తమ కోసమే పుట్టి ఉంటాడని..వాళ్ళు నమ్మగలిగినప్పుడే సామూహిక అభిమానం… ప్రేమ పుడుతుంది. అటువంటి మహనీయుడు ‘మెగాస్టార్ చిరంజీవి’. ఆయన అందరివాడు…
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు…
చాలామందికి.. కోట్లాది మందికి.. కులాలు..మతాలకి సంబంధం లేకుండా పండగరోజు. పండగ ఎందుకు చేసుకోవాలి. ఆయన ఓ మంచి నటుడు. తన పారితోషికం తను తీసుకుని నటించారు. ప్రేక్షకులని వినోద పరిచారు. ఇండస్త్రీని ఆర్థికంగా పరిపుష్టి చేశారు. దీనికి పండగ చేసుకుంటారా అన్ని ప్రశ్నిస్తే సరికాదు. ఓ ఔత్సాహిక నటుడి నుంచి ప్రజలకు కష్టాల్లో అండ దండగా నిలిచే మానవతా నాయకుడి అద్భుతమైన ప్రయాణం ఆయన జీవితం. 65సంవత్సరాల జీవితం.. 42సంవత్సరాల సినీయానం.. అందరికీ తెరిచిన పుస్తకం. అయినా తరతరానికీ, రోల్ మోడల్ గా నిలిచిన వ్యక్తి. ఎప్పటికప్పుడు ప్రభావితం చేసి స్ఫూర్తి కలిగించిన శక్తి.

అభిలాష..మగ మహారాజు.. రోషగాడు..మంత్రి గారి వియ్యంకుడు..సంఘర్షణ..గుండా..ఛాలెంజ్..రుస్తుం..దొంగ..జ్వా ల… విజేత.. అడవిదొంగ.. కొండవీటి రాజా.. రాక్షసుడు.. చంటబ్బాయ్.. దొంగమొగుడు.. పసివాడి ప్రాణం.. రుద్రవీణ..స్వయంకృషి.. యముడికి మొగుడు..అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు.. కొండవీటి దొంగ.. జగదేకవీరుడు.. అతిలోక సుందరి.. కొదమ సింహం.. ప్రతిబంద్..రాజా విక్రమార్క. గ్యాంగ్ లీడర్..రౌడీ అల్లుడు… ఘరానామొగుడు.. హిట్లర్.. బావగారు బాగున్నారా…మాస్టర్.. చూడాలని ఉంది..ఇద్దరు మిత్రులు… అన్నయ్య…ఇంద్ర.. రాగూర్.. శంకర్ దాదా ఎం.బి.బిస్. స్టాలిన్.. ఖైదీ నెం. 150. సైరా నరసింహారెడ్డి.. ఇలా సాగుతుంది ఆయన సినీయాణం.

SA: