అంతర్జాతీయ యువజన దినోత్సవం – పోటీలు

కృష్ణా జిల్లా స్థాయిలో ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు …

ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని.. ఆగస్టు 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో యువజనోత్సవాలు .. వ్యాసరచన, వకృతం, క్విజ్, జిఐఎఫ్, ఒక నిమిషం వీడియో, పోస్టర్ పెయింటింగ్ పోటీలు.. విజేతలకు సర్టిఫికెట్ తో పాటు నగదు బహుమతి..
జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్. కృష్ణా జిల్లా స్థాయిలో ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆన్లైన్ లో యువజనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు.
మంగళవారం (4-8-20) స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 12వ తేదిన అంతర్జాతీయ యువజనోత్సవం పురస్కరించుకుని వాల్ పోస్టర్ను కలెక్టర్ ఇంతియాజ్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్కుమార్, క్రిషి సిఇఓ పిఎస్ఆర్ ప్రసాద్, మేనేజర్ యు. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ అంతర్జాతీయ యువజనోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ప్లాట్పం పై జిల్లాలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతకు ఈనెల 7 తేది నుండి 10 తేది వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాసరచన, వక్తృతం, క్విజ్, జీఐఎఫ్, ఒక నిమిషం వీడియో, పోస్టర్ పెయింటింగ్ పోటీలను అన్లైన్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని అన్ని కళాశాలలకు, యువజన సంఘాలు, సామాజిక సేవా సంస్థల నుంచి 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆసక్తిగల యువత ఈ పోటీలో పై తేదీలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ప్లాట్పం హాజరు కావచ్చున్నారు. ముందస్తుగా నమోదు కొరకు htps://bit.ly/IYD_KRISHNA DISTRICT  వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవలన్నారు.నమోదు చేసుకున్న యువతకు పై తేదీలో పోటీలు నిర్వహించబడతాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి అంశంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థాయి విజేతలకు సర్టిఫికెట్స్ మెయిల్ లేదా పోస్టు ద్వారా పంపబడతాయన్నారు. విజేతలకు నగదు పురస్కారాన్ని వారి వారి వ్యక్తిగత బ్యాంకుఖాతా నుందు జమచేయబడతాయన్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన యువజనులు తమ పేర్లను పై వెబ్ సైట్లో ఆగస్టు 6వ తేది లోగా నమోదు చేసుకోవలన్నారు. ఇతర వివరాలకు ceastepkrishna@gmail.com మరియు ఫోన్‌ నెంబరు 0866-2452722 లో సంప్రదించవచ్చన్నారు.
ఈనెల 7వ తేదీనుండి 10 తేదీ వరకు అలైన్‌లో నిర్వహించే పోటీలో భాగంగా వ్యాసరచన (గ్లోబల్ చర్య కోసం యువత ప్రమేయం, హెచ్ఐవి,కోవిడ్ -19 వంటి అంటు వ్యాధులను ఎలా నివారించాలి. దేశ సామాజిక అభివృద్ధిలో మహిళల పాత్ర) వక్తృత్వం (ప్రంట్‌లైన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్,కోవిడ్-19 రోగుల పట్ల సామాజిక వివక్ష యొక్క స్టిగ్మాను ఎలా పరిష్కరించాలి, తద్వారా ప్రజలో వారికి చికిత్స చేసేందుకు అవగాహన) క్విజ్ (ఫేస్ మాస్క్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, దానిని సరిగా ఎలా ఉపయోగించుకోవాలి, కోవిడ్-19, పర్యావరణ పరిరక్షణ
మొదలైన సామాజిక అంశాలు) జిఐఎఫ్ (గ్రాఫిక్ ఇంటర్చేంజ్ పార్మాట్ ఒక నిమిషం మీడియో-ట్రాపిక్ నియమాలు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యతిరేక, నవరత్నాలు,స్వచ్ఛ భారత్, పౌర అవగాహన కల్పించే కోవిడ్-19, హెచ్ఐవి, ఎయిడ్స్ మొదలగు అంశాలు) పోస్టర్ మేకింగ్/ పెంటింగ్ ( కోవిడ్-19, హెచ్ఐవి/ ఎయిడ్స్ ఇతర సామాజిక పర్యావరణ అంశాలు) పోక్/సెమీ క్లాసికల్ డాన్స్ (జానపదం, శాస్త్రీయం, విభిన్న శైలి(సోలో) అంశాలు ఉంటాయన్నారు.

SA: