‘మండలి’ కి ఎన్టీఆర్ భాషా పురష్కారం

ఈరోజు(26-5-23) హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వావిద్యాలయం ఎన్టీఆర్ కళాప్రాంగణంలో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో కిన్నెర ఎన్టీఆర్ భాషా పురష్కారం మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రధానం చేశారు. ఎమ్. వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కే.వి.రమణా చారి ఈసభలో ప్రత్యేకఅతిథిగా, మాజీ జస్టిస్ భానుప్రసాద్ గారు, ఎ.పి. మాజీ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, ఓలేటి పార్వతీశం గారు ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు.

కార్యక్రమానికి ముందుగా మిత్ర బృందంచే ఎన్టీఆర్ సినిమా ఘంటశాల పాటల కార్యక్రమం జరిగింది. వక్తలు అందరూ తెలుగు భాష గురించి, ఎన్టీఆర్ తెలుగుభాషకు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, నటుడుగా రానింపు, గుర్తింపు, పురాణపాత్రలు గురించి చాలా విషయాలు చెప్పారు. తెలుగు భాషా, సాహిత్యానికి మండలి బుద్ధప్రసాద్ గారి సేవలు కొనియాడదగినవని, ఎన్టీఆర్ భాషా పురష్కారానికి మండలి బుద్ధప్రసాద్ నూరు శాతం అర్హులు వెంకయ్య నాయుడు అన్నారు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ కొందరు తెలుగుభాషకు ఆపకీర్తి తెస్తున్నారు. వారికి బూతులతోనే సమాధానం చెప్పండి అని సూచిస్తూ… బూతులు అంటే ఎన్నికల్లో ఎర్పాటు చేసే ఎన్నికల బూతు. ఆబూతుల్లో తగినవిధంగా సమాధానం చెప్పండి. సరిపోతుంది అన్నారు. ఎన్టీఆర్ గురించి అనేక విషయాలు చెప్పారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్.. మద్దాలి రఘురామ్ నిర్వహించారు.

కళాసాగర్

SA: