సామాజిక సేవలో “పెన్ “జర్నలిస్టులు

600 మందికి భోజనం ఏర్పాట్లు చేసిన జర్నలిస్ట్స్ అసోసియేషన్

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేదానిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్న నేపధ్యలో విజయవాడ నగరపాలక సంస్థ నిర్వాసితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) భోజన ఏర్పాట్లు చేసింది. పెన్ రాష్ట్ర సంఘ నాయకులు బత్తిన సుబ్రహ్మణ్యం, పెన్ శ్రేయోభిలాషులు ఇవాని శ్రీరామచంద్రమూర్తి కుటుంభసభ్యులు, నాగలక్ష్మి సౌజన్యంతో ఆదివారం నగరపాలక సంస్థ సూచించిన ఆటోనగర్ ఎగ్జిబిషన్ సొసైటీ షెల్టర్, విఆర్ సిద్దార్థా ఇంజనీరింగ్ కాలేజ్ షెల్టర్, లయోలా కాలేజ్ షెల్టర్ తదితర పునరావాస కేంద్రాలలో వలస కార్మికులు, నిర్వాసితులకు 600 మందికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్బంగా పెన్ జర్నలిస్ట్ సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెన్ జర్నలిస్ట్ సంఘం ఆదినుంచి జర్నలిస్ట్స్ సంక్షేమంతో పాటు సామాజిక సేవలలో ఎప్పుడూ ముందుందన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలలో పెన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.విజయవాడ నగరంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బదులు ఎదుర్కొంటున్న అన్నార్తులకు గత పదిహేను రోజులుగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వ నిబంధనలు అనుసరించి నగరపాలక సమస్థ సూచించిన పునరావాస కేంద్రాల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెన్ సంఘ నాయకులు జూనూతుల శివరామ్, బద్దం సుమలత, బి. జగన్ మోహన్, సాయి శివరామ్, దొండపాటి వెంకటేశ్వరరావు, ఎన్. శ్రీరామ్, బండ్రెడ్డి నాని, టీవీ. రంగారావు. ఆవాల దుర్గాప్రసాద్, గురజాడ సావిత్రి పాల్గొన్నారు.

SA: