సింధూతాయి కి ‘పిన్నమనేని ఫౌండేషన్ ‘ పురస్కారం

డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ 29 వ వార్షికోత్సవం ఈ నెల 16 న విజయవాడలో సిద్దార్ధ ఆడిటోరియం లో నిర్వహించనున్నారు.

గత 25 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా సామాజిక, కళా రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు అందిస్తున్నారు. గతంలో మేడసాని మోహన్, రావురి భరద్వాజ, ఆచంట వెంకట రత్నం నాయుడు, దాశరథి రంగాచార్యులు, వి.యస్. రమాదేవి లాంటి ఉద్దండులు ఈ పురస్కారాలు అందుకున్నారు.
29 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ సామాజిక కార్యకర్త సింధూతాయి సత్కాల్ సంస్కృత విద్య రంగ పండితులు రామకృష్ణ కు పురస్కారాలు ప్రకటించారు.
సింధూతాయి సత్కాల్ అనాధాలకు అమ్మగా ప్రపంచ ప్రసిద్ధురాలు. అనేక మంది పేదలను దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్ధింది. ఆమె సేవలకు గుర్తింపు గా 750 కు పైగా అవార్డులు దక్కాయి. అలాంటి వ్యక్తిని ఫౌండేషన్ తరుపున సత్కరించటం అభినందనీయం.

శ్రీమద్భాగవతంలో అద్వెత మత ప్రతిష్ట అనే అంశం పై డాక్టర్ డి. రామకృష్ణ పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు. ప్రస్తుతం మేరీ స్టెల్లా కళాశాలలో సంస్కృత శాఖధిపతిగా పనిచేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కరాన్ని అందుకున్నారు. డాక్టర్ రామకృష్ణ ను మా ఫౌండేషన్ తరుపున పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ సి.నాగేశ్వరరావు.

SA: