పీవీ అంతర్జాతీయ క్యారికేచర్ పోటీ ఫలితాలు

29 దేశాల నుండి 250 కి పైగా ఎంట్రీలు … మొదటీ స్థానం పెరు దేశస్థుడు ఒమర్  కి…

తెలంగాణా కార్టూనిస్టుల సంక్షేమ సంఘం ఆద్వర్యం లో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత పీవీ నరసింహా రావు శతజయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పీవీ క్యారికేచర్ పోటీ ఫలితాలను ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి ప్రకటించారు. మొదటి బహుమతి – Omar Zevallos – PERU దేశం నుంచి గెలుపొందగా, రెండవ బహుమతి raed khalil-syria దేశం నుంచి, మూడవ బహుమతి Nanjunda Swamy YS, India నుంచి గెలుపొందినట్లు తెలియజేశారు. అలాగే K. Durga Bhavani – Inidia, Ashok Boga – India, Tuniki Bhoopathi-India లు ప్రత్యేక బహుమతులు గెలుపొందినట్లు రాజమౌళి తెలియజేశారు. 50 నుంచి 100 దేశాల్లో ఈ పోటీ వివరాలను ప్రచారం చేయడం జరిగిందని, 29 దేశాల్లోని గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఈ పోటీలో పాల్గొన్నట్లు వివరించారు. దేశ విదేశాల్లోంచి 225 ఎంట్రీలు వచ్చినట్లు తెలియజేశారు. త్వరలో ఈ క్యారికేచర్లతో బెంగుళూర్ లో ఒక ప్రదర్శన కూడా నిర్వహించనున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వ సహకారం తో కూడా రాష్ట్రం లో ఒక ప్రదర్శనను కూడా నిర్వహించే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినట్లు, వారు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.

SA: