సాహిత్య అకాడెమీ ‘మాతృభాషా’ సమ్మేళనం

అంతర్జాతీయ ‘మాతృభాష దినోత్సవం’ సందర్భంగా సాహిత్య అకాడెమీ – ఆంధ్ర లయోల కళాశాల సంయుక్తంగా మాతృభాషల ప్రాధాన్యత గురించి 2004, ఫిబ్రవరి 21 నాడు విజయవాడ, లయోల కళాశాల మినీహాల్ లో వైభవంగా జరిగింది.

ప్రారంభ సమావేశంలో డా. పాపినేని శివశంకర్ మాతృభాషల ప్రాధాన్యత గురించి, అజంత భాష, సుమధుర భాష అయిన భాషా వైశిష్ట్యాన్ని గురించి చక్కగా ప్రసంగించారు. గౌరవ అతిథిగా ఫాదర్ కిషోర్ పాల్గొన్నారు. తెలుగు శాఖా అధ్యక్షులు కోలా శేఖర్ వందన సమర్పణ చేశారు.

మొదట సమావేశంలో మాతృభాష పరిరక్షణ కోసం బృంద చర్చ జరిగింది. వెంకటేష్ మాచకనూర్ (కన్నడ), ఇందు మోహన్ (మలయాళం), ఎల్. రామమూర్తి (తమిళం) ఈ చర్చలో పాల్గొన్నారు. సమన్యకర్తగా గారపాటి ఉమామహేశ్వర రావు (తెలుగు) సమర్థవంతంగా నిర్వహించారు.

రెండవ సమావేశంలో మాతృభాష భట్టు నాగేశ్వరరావు (బంజార) అధ్యక్షత కవి సమ్మేళనం జరిగింది. అక్షత రాజ్ పేర్ల (తుళు), ఆర్. ఆనందన్ (బడగ), ఆత్రం మోతీరాం (కోలామి), రంగనాథం (తెలుగు) ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.
మూడవ సమావేశంలో వాసమల్లి (తోడ) అధ్యక్షతలో అద్భుతంగా జరిగింది. ఈ సమావేశంలో ముల్లేంగడ మాధోన్ పూవయ్య (కొడవ), రామచంద్రన్ కందమల(ముల్లుక్కురుమ), సాయికుమార్ (గోండి), బండ్ల మాధవరావు (తెలుగు), మందరపు హైమావతి (తెలుగు) పాల్గొన్నారు.


పాల్గొన్న కవులందరూ వాళ్ళ మాతృభాషలోను, ఆగ్లభాషలోను కవితలు రాశారు. చాలా మంది కవులు మాతృభాషా ప్రాముఖ్యాన్ని వివరిస్తూ కవితలు వినిపించారు. లిపిలేని బంజరా భాషా కవులు తమ భాషలో చేసిన గానం ప్రేక్షకులను అలరించింది. బండ్ల మాధవరావు ‘మావూరు రాజధాని అయ్యింది’ కవిత, మందరపు హైమావతి భాషా ప్రాముఖ్యానికి సంబధించిన ‘పూలహారం’, ‘వంటింటి సుర్యోదయాలు’ కవితలు చదివారు. వీరి ఇద్దరి తెలుగు కవితలను డా. కల్లూరి శ్యామల ఆగ్లంలోకి అనువదించారు.

మాతృభాషల ప్రాముఖ్యత కనుమరుగయిపోతున్న ప్రస్తుత కాలంలో సాహిత్య అకాడెమీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మాతృభాషలను ప్రోత్సహించడం అభినందనీయం.

మందరపు హైమావతి

SA: