శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్ , మాదాపూర్ శిల్పారామంలో పల్లెటూరిని తలపించే వాతావరణంలో సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, ఎరుకసాని, పిట్టలదొర మాటలాగారడి సందర్శకులను అలరించాయి.
మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి సందర్శకులు తండోపతండాలుగా విచ్చేసారు. పల్లె వాతావరణంలో పల్లెటూరికి తలపించే పండుగ సంక్రాంతి పండుగ శిల్పారామం ఆవరణలో అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి గంగిరెద్దుల విన్యాసాలు పిల్లలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, ఎరుకసాని, పిట్టలదొర మాటలాగారడి ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, నాగపూర్ వారి సంయుక్త నిర్వహణలో భాగంగా జానపద కళారూపాలు పగటివేషాలు, ఒగ్గుడోలు, బుట్టబొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

శ్రీమతి విశాఖ ప్రకాశ్ చే “ఆండాళ్ చరిత్ర” నృత్యరూపకం ఎంతగానో ఆకట్టుకుంది. గోదాదేవి వ్రత వృతాంతం ఆద్యంతం ఆకట్టుకుంది.

బెంగళూరు నుండి విచ్చేసిన కుమారి ప్రియాంక మరియు మేఘన చంద్రయూళి ప్రదర్శించిన భజమానస, అష్టపది, థిల్లాన అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

SA: