చలపాక కు కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఫెలోషిప్‌

(చలపాక ప్రకాష్‌కు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్‌ ఫెలోషిప్‌)

కవి, రచయిత చలపాక ప్రకాష్‌ కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్‌ ఫెల్‌షిప్‌కు ఎన్నికైయ్యారు. 2020-2021 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్‌ “తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం” అనే అంశంపై 2 సంవత్సరాలపాటు పరిశోధించి పత్రసమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ పరిశోధనకుగాను ప్రకాష్‌కు రెండేళ్లపాటు ప్రతి నెలకు రూ 20,000/- చొప్పున ఫెలోషిప్‌ నగదు వేతనంగా అందిస్తారు. గతంలో ఇదే కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖనుండి “అత్యాధునిక కవితారూప ప్రక్రియ-నానీ’ అనే అంశంపై పరిశోధన చేసి చలపాక జూనియర్‌ ఫెలోషిప్‌ అందుకోగా మళ్ళీ ఇప్పుడు సీనియర్‌ ఫెలోషిప్‌ అందుకోవడం విశేషం. రచయితగా, కవిగా, పత్రికా సంపాదకునిగా కృషిచేస్తున్న చలపాక ప్రకాష్‌ సీనియర్‌ ఫెలోషిప్‌ కు ఎంపికయినందుకు 64కళలు.కాం అభినందనలు తెలియజేస్తుంది.

-కళాసాగర్

SA:

View Comments (6)

  • మిత్రుడు చలపాక ప్రకాష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన ఇటువంటి మరెన్నో ప్రభుత్వ పథకాలకు ఎన్నిక కావాలి.

  • రచయిత చలపాక ప్రకాష్ సీనియర్ ఫెలోషిప్ వచ్చినందుకు అభినందనలు... డాక్టర్ బెజ్జంకి

  • మిత్రులు.. ప్రముఖ సాహితీవేత్త.. సంపాదకులు చలపాక ప్రకాష్ గారికి హార్ధిక అభినందనలు.. శుభాకాంక్షలు..

  • చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు...
    ప్రకాష్ గారూ! *అభినందనలు*