(చలపాక ప్రకాష్‌కు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్ ఫెలోషిప్)
కవి, రచయిత చలపాక ప్రకాష్ కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్ ఫెల్‌షిప్‌కు ఎన్నికైయ్యారు. 2020-2021 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్ “తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం” అనే అంశంపై 2 సంవత్సరాలపాటు పరిశోధించి పత్రసమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ పరిశోధనకుగాను ప్రకాష్‌కు రెండేళ్లపాటు ప్రతి నెలకు రూ 20,000/- చొప్పున ఫెలోషిప్ నగదు వేతనంగా అందిస్తారు. గతంలో ఇదే కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖనుండి “అత్యాధునిక కవితారూప ప్రక్రియ-నానీ’ అనే అంశంపై పరిశోధన చేసి చలపాక జూనియర్ ఫెలోషిప్ అందుకోగా మళ్ళీ ఇప్పుడు సీనియర్ ఫెలోషిప్ అందుకోవడం విశేషం. రచయితగా, కవిగా, పత్రికా సంపాదకునిగా కృషిచేస్తున్న చలపాక ప్రకాష్ సీనియర్ ఫెలోషిప్ కు ఎంపికయినందుకు 64కళలు.కాం అభినందనలు తెలియజేస్తుంది.
-కళాసాగర్
కృతజ్ఞతలు
మిత్రుడు చలపాక ప్రకాష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన ఇటువంటి మరెన్నో ప్రభుత్వ పథకాలకు ఎన్నిక కావాలి.
అభినందనలు.
రచయిత చలపాక ప్రకాష్ సీనియర్ ఫెలోషిప్ వచ్చినందుకు అభినందనలు… డాక్టర్ బెజ్జంకి
మిత్రులు.. ప్రముఖ సాహితీవేత్త.. సంపాదకులు చలపాక ప్రకాష్ గారికి హార్ధిక అభినందనలు.. శుభాకాంక్షలు..
చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు…
ప్రకాష్ గారూ! *అభినందనలు*