*పర్యావరణంలో భాగమైన చిరుప్రాణి పిచ్చుకను రక్షించుకోవటం మనందరి బాధ్యత
*‘సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్’ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
విజయవాడ కు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పిచ్చుకను చేసుకుందామా మచ్చిక అనే నినాదంతో నిర్వహించిన “సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్” చిత్రకళా ప్రదర్శన మరియు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
‘అమర్ చిత్రకథ’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణ కిరణ్ చిత్రకళా ప్రదర్శనను లాంచనంగా ప్రారంభించగా… అతిథులుగా హాజరైన, గోళ్ళ నారాయణరావు, ఎస్.పి. రామరాజు, అనిల్ డానీ, ఏడుకొండలు యాదవ్ లు పర్యావరణ పరిరక్షణ మరియు జీవరాశుల సంరక్షణకై మనం పోషించాల్సిన పాత్ర గురించి విపులంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చుకల మనుగడకై పాటుపడుతున్న డాక్టర్. వీర మహేష్, రమేష్ సుంకోజు, పోలుపర్తి దాలి నాయుడులను స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంస్థ ఘనంగా సత్కరించింది.
అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో సేవ్ స్పారో నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేతలకు క్యాష్ అవార్డులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, ప్రత్యేకంగా చేపించిన బర్డ్ హౌస్ లు వరికంకుల కుచ్చులు అందజేసారు.
ఈ కార్యక్రమాన్ని “స్ఫూర్తి” శ్రీనివాస్ పర్యవేక్షించగా.. జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారులు సునీల్ కుమార్ అనుమకొండ, గిరిధర్ అరసవల్లి, ఎస్ పి మల్లిక్, రమేష్ అర్కాల, కళాసాగర్, శ్రావణ్ కుమార్, సంధ్యారాణి, మేడా రజని, లలితా సౌజన్య, లక్ష్మీ ప్రియాంక, శివాజీ, గోపి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.