సాంస్కృతిక శాఖకు ‘దామెర్ల ఆర్ట్ గ్యాలరీ’

సాంస్కృతిక శాఖకు ‘దామెర్ల ఆర్ట్ గ్యాలరీ’

January 12, 2025

మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ సాంకేతిక శాఖలో ఇరుక్కుపోయి సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్న రాజమండ్రి, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ని సాంస్కృతిక శాఖకు బదలాయించేందుకు కృషి చేస్తామని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ బిల్లులు కూడా చెల్లించలేని దుస్ధితిలో ఆర్ట్…

కళా చరిత్రకారుడు జగదీష్ మిట్టల్ కన్నుమూత !

కళా చరిత్రకారుడు జగదీష్ మిట్టల్ కన్నుమూత !

January 8, 2025

ప్రఖ్యాత చిత్ర చరిత్రకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత జగదీష్ మిట్టల్ 7-01-2025, మంగళవారం తన 99వ యేట కనుమూశారు. హైదరాబాద్ దోమలగూడ గగన్ మహల్ రోడ్ లో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిన జగదీష్ కమలా మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ విషాదంతో మూగవోయింది. హైదరాబాద్ మొఘల్ చిత్రకళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన జగదీష్ మిట్టల్ అద్భుత ప్రకృతి సౌందర్య…

వరదా వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరణ

వరదా వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరణ

January 7, 2025

రాజమండ్రిలో దామెర్ల రామారావు కళాప్రాంగణంలో వరదావారి విగ్రహ ఆవిష్కరణ>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6 జనవరి 2025 న రాజమహేంద్రవరం, శ్రీ దామెర్ల రామారావు చిత్ర కళామందిరం నందు మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర చిత్రకళా పితామహులు ఆచార్య వరద వెంకటరత్నం గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించారు….

కార్టూనిస్టు, రచయిత భువన్ ఇకలేరు

కార్టూనిస్టు, రచయిత భువన్ ఇకలేరు

January 5, 2025

సుప్రసిద్ధ రచయిత, కార్టూనిస్టు భువన్ (ఎం.వి.జె. భువనేశ్వరరావు) నిన్న సాయంత్రం (4-01-2025, శనివారం) అనారోగ్యం తో విశాఖపట్నం హాస్పటల్లో కన్నుమూశారు. భువన్ మరణవార్త విని కార్టూనిస్టు మిత్రులు విజయవాడలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవం బాలల వేదికపై తమ సంతాపాన్ని తెలియజేశారు. అనకాపల్లి నివాసి అయిన భువన్ రచయితగా, కార్టూనిస్టుగా, కాలమిస్టుగా సాహిత్యరంగంలో గత మూడు దశాబ్దాలుగా కృషి…

‘శర్మ శతకం’ గ్రంథావిష్కరణ

‘శర్మ శతకం’ గ్రంథావిష్కరణ

January 4, 2025

సామాజిక, సమకాలీన, రాజకీయ అంశాలను స్పృశిస్తూ కవి, రచయిత శర్మ సీహెచ్‌., రాసిన ‘శర్మ శతకము’ పద్య సంపుటి శుక్రవారం విజయవాడలో ఆవిష్కృతమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న 35వ విజయవాడ పుస్తక ప్రదర్శన ఇందుకు వేదికైంది. అచ్చంగా రచయితల కోసమే ఏర్పాటుచేసిన రైటర్స్‌ స్టాల్‌లో సాహితీవేత్త డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన…

వికీపీడియా గురించి మీకు తెలుసా?

వికీపీడియా గురించి మీకు తెలుసా?

తెలుగు వికీపీడియాపై అందరికీ అవగాహన అవసరం: తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలు దాటిన సందర్భంగా 2024, డిసెంబరు 26న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమంలో “వికీపీడియా గురించి మీకు తెలుసా?” అనే ఉచిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం…

మన సినిమా – ఫస్ట్ రీల్

మన సినిమా – ఫస్ట్ రీల్

December 31, 2024

“ఒక రచయిత పీహెడ్‌డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో… ‘మన సినిమా – ఫస్ట్ రీల్’ పుస్తకం అలా ఉంది. నా దృష్టిలో జయదేవ కాలమిస్ట్, జర్నలిస్ట్ మాత్రం కాదు. అంతకు మించిన వాడు. కచ్చితంగా రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. ఒక విషయాన్ని చాలా ఆథెంటిక్‌గా చెప్పగలడు. ‘ఫస్ట్ రీల్’లో తెలుగు టాకీ తాలూకా కథ…

చారిత్రక అవసరం ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ పుస్తకం

చారిత్రక అవసరం ‘ఆర్ట్ ఆఫ్ ఏ.పి.’ పుస్తకం

December 27, 2024

‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ (Art of AP- Coffee Table book) గ్రంథం చూశాక కొన్ని మాటలు రాయాలనిపించింది. తన కళ, తన కృషి మాత్రమే గుర్తింపబడాలని.. ఇతరుల విజయాలను సహించలేని, ఒప్పుకోలేని సంకుచిత భావాలతో నిండి వున్న నేటి కాలంలో అందరిలా కాకుండా తన జాతి మొత్తం తానే అనుకుంటూ… ఆ జాతిగౌరవాన్ని పలువురికి ప్రకటించాలనుకున్న కళాసాగర్…

దాతృత్వానికి ప్రతీక డాక్టర్ పి.వి.జి. రాజు

దాతృత్వానికి ప్రతీక డాక్టర్ పి.వి.జి. రాజు

December 19, 2024

మంచి మనసున్న మారాజు డాక్టర్ పి.వి.జి. రాజు దాతృత్వానికి ప్రతీక – పూసపాటి అశోక్ గజపతి రాజుడాక్టర్ పి.వి.జి. రాజు మంచి మనసున్న మహారాజు అని, దాతృత్వానికి నిలువుటద్దమని, అలాంటి కుటుంబంలో జన్మించే అవకాశం కలగడం భగవంతుడు అందించిన వరం అని పూర్వ కేంద్ర మంత్రివర్యులు పి. అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

పెనుగొండ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

పెనుగొండ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

December 19, 2024

ప్రముఖ రచయిత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో…