ఒక వేణువు వినిపించెను సమ్మోహ గీతిక

జులై 2 ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలనుంచి ఒకే సంగీత వాయిద్యం చుట్టు అనేక వాద్యాలు, కర్ణాటక,హిందూస్తాని, పాశ్చ త్యత్య బాణిలు, కళాకారులూ చేసిన సంగీత నర్తనం, విన్యాసం ఐదు గంటలసేపు ప్రేక్షకులను రస డోలికల్లో ముంచింది. యువతను కేరింతలతో పదే పదే చప్పట్లతో dance చేయించింది. సినీ పరిశ్రమకు సపరిచితులైన ప్రముఖ వేణు గాన విద్వాంసుడు తాళ్లూరి నాగరాజు 30 ఏళ్ళ సంగీత ప్రస్థానం హైదరాబాద్ కళాకారులకు ఒక రాగరంజితమైన రాస రమ్యానుభూతిని అందించింది. నాగరాజు సతీ మణి, సుత (లలిత్) మేతంగా తన అద్భుత వేణు గానంతో ఒక శివ తాండవం చేస్తున్నట్లుగా తన కళానైపుణ్య విశ్వరూపాన్ని ప్రదర్శించారు. Doctor వరప్రసాద్ రెడ్డిగారు, LV సుబ్రహ్మణ్యం గారు వంటి మహమహులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఒక భాగస్వామిని చేయటం ఆనందం కలిగించింది. సుప్రసిద్ధ సినీ టీవీ నటుడు ప్రదీప్ నిర్వహణలో అయిన కుమార్తె నిహారిక అందమైన స్వచ్ఛమైన వ్యాఖ్యనంతో మొదలైన వేణుగాన సమ్మోహనం మొదట నవరాగ మాలిక వర్ణంతో, ఎందరో మహానుభావులు త్యాగరాజ కీర్తనతో సంగీత ప్రియులకు స్వాగతం పలికిన అనుభూతిని కలిగించింది. తరువాత అనూహ్యంగా రాగ్ యమన్ ను వినిపించి హిందూస్థానీ మధురిమలను చవి చూపించింది. ఆ తరువాత రారా వేణుగోపాలను పాశ్చత్య సంగీత బాణిలో ఒక ప్రయోగత్మక ప్రక్రియను ఆవిష్కరించింది. తరువాత రెహ్మాన్ కు చెందిన Sunshine School కళా కారులు ప్రదర్శించిన మొజాక్ రచన, వెస్టర్బ్)స్ప్రింగ్ నాగరాజు స్వీయం స్వర రచన చేసిన సింఫని, ఇంకా మోహినిదే (బేస్ కళాకారిణి ) సిద్దార్ధ నాగరాజాన్ (డ్రమ్స్)తో జుగల్బంది దాదాపు పదిహేను నిమిషాలు ఏక బిగిని సాగి యువత తో పాటు అందరినీ అక్కట్టుకుని ఆడిటోరియం చప్పట్లతో యువత కేరింతలతో మారు మోగింది. ఇక మణి నాగరాజు భావయుక్తంగా భర్త వేణు గానంలో మమేకమై భక్తి భావంతో ఆలపించిన నిర్వాణ శతకంలో శివోహంశివోహం ఒక ఆధ్యాత్మిక వీచికను ప్రసరింప జేసీ కళాకారుల, నిర్వాహకుల ఆధ్యాత్మిక సంస్కారాన్ని చాటి చెప్పింది. ఇళయరాజాను గురువుగా భావించే నాగరాజు ఆయన చేసిన దళపతి, అంజలి ఇంకా కొన్ని పాటల్ని తన వేణువులో పలికించి యువత ను ఆనంద పరిచారు. నాగరాజు గారు ఎన్నో నాగరాలలో ఇలాంటి సమ్మోహనాస్త్రాలు సంధించి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
-సూర్యప్రకాశరావు

Venugaanam Talloori Nagaraju with Vara Prasada Reddy, Gurava Reddy

SA: