ఫిబ్రవరి 8న తిరుపతిలో జాతీయ చిత్రకళా ప్రదర్శన

తిరుపతి ఆర్ట్ సొసైటీ రెండవ జాతీయ చిత్రకళా ప్రదర్శన
వేదిక : తిరుపతి, మహతి కళాక్షేత్రం మినిహాలు
తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి 37 మంది చిత్ర కళాకారులు చిత్రించిన వర్ణచిత్రాలను పోటికి వచ్చాయి. వీటి నుండి 23 వర్ణ చిత్రాలు, ఒక శిల్పం ఎన్నికైనాయి. ఎన్నికైన చిత్రకారులను ప్రఖ్యాతిగాంచిన 11 మంది చిత్రకారుల పేరుల మీదుగా అవార్డులు ప్రదానం మరియు 13 మందికి జ్యూరి అవార్డులతో 9వ తేదీన జరిగే కార్యక్రమంలో చిత్రకారులను సత్కరిస్తారు. ఈ చిత్రాలతో పాటుగా సుమారు 100 వర్ణ చిత్రాలు ఫిబ్రవరి 8 మరియు 9 తేదీలలో (శనివారం, ఆదివారం)  మహతి కళాక్షేత్రం మినిహాలు నందు ప్రదర్శింపబడుతాయి. తిరుపతి లోని పాఠశాలల్లో 200 మంది బాల, బాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించబడ్డాయి. పోటీలో ఎన్నికైన విద్యార్థులకు సొసైటి తరపున బహుమతి ప్రధానం జరుగుతుంది. చిత్రకారులు, చిత్ర కళాభిమానులు పాల్గొని ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా తిరుపతి ఆర్ట్ సొసైటీ కార్యదర్శి ఈ. బాలసుబ్రమణ్యం తెలియజేసారు.

SA: