మందులకన్న అత్యంత శక్తివంతమయిన చికిత్స ‘ఉపవాసం’

చాలామంది దృష్టిలో ‘ఉపవాసం’ అనే మాట ఏదో మత ఆచారానికి సంబంధించిన వ్యవహారం. అత్యధిక ప్రధాన మతాలు ఉపవాసాన్ని ఏదో ఒక సందర్భంలో ఆచారంగా ప్రబోధిస్తాయి. హిందువులు శివరాత్రి నాడు, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ముందు రోజుల్లోను, మహ్మదీయులు రంజాన్ మాసంలోనూ ఉపవాసం ఉంటారు. బౌద్ధులు, జైనులు, యూదులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం కేవలం శరీరాన్నే కాకుండా మనసును కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు.
ఉపవాసం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, జీవన కాలాన్ని పెంచుతుందనే విషయం గత కొద్ది కాలంగా వైద్య వర్గాల చర్చలకు కేంద్ర బిందువైంది. ఉపవాసం వలన రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు ఇతర జీవక్రియల ప్రమాణాలన్నీ మెరుగవుతాయని రుజువయింది. ఉపవాసానికి తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ కొవ్వు (LCHF) పదార్థాలు ఉండే ఆహారం తోడైతే అద్భుత మైన ఫలితాలనిస్తాయని కూడా నిర్ధారణ అయింది. దురదృష్టవశాత్తు ప్రధాన స్రవంతిలో ఉన్న వైద్యుల్లో ఎక్కువ శాతం మంది తమ దగ్గరకు ఊబకాయంతోను, 2వ రకం మధుమేహంతోను బాధపడుతూ వచ్చే రోగులకు పైన చెప్పుకున్న ఆహారాన్ని సూచించ లేకపోవడానికి కారణం అవగాహనా లోపమే.
డాక్టర్ జాసన్ ఫంగ్ (ఈయన ‘ఒబేసిటీ కోడ్’ ‘డయాబెటిక్ కోడ్’ అనే అత్యధికంగా అమ్ముడు పోయిన పుస్తకాలను కూడా వ్రాశారు) వ్రాసిన ఈ పుస్తకాన్ని శ్రీ సమదర్శిని గారు సరిగ్గా సరైన సమయంలోనే అనువదించి మనకందించారు. జీవక్రియల సంబంధ వ్యాధులకు చికిత్సచేసే వైద్యులే కాకుండా ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకునే వారూ, ఆరోగ్యాన్ని మెరుగు పరచు కోవాలనుకునే వారందరూ తప్పక చదవ వలసిన పుస్తకమిది. అధిక ప్రయోజన కరంగా ఉండే రకరకాల ఉపవాస విధానాలను ఈ పుస్తకం వివరిస్తుంది. సహజంగా దొర్లే పొరపాట్లను హెచ్చరించి గరిష్ట ప్రయోజనం పొందే మార్గాలను సూచిస్తుంది. ఈ పుస్తకం.
దైనందిన జీవితంలో ఉపవాసం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాలను కునేవారూ, ఉపవాసాన్ని గురించి అందరికీ తెలియచెప్పాలనుకునే వారు మరియు ఉపవాసాన్ని అవలంబిస్తున్న వారూ అందరూ చదివి తీరవలసిన పుస్తకం ఇది.

ప్రతులకు : అనేక బుక్ స్టాల్, విజయవాడ, మొబైల్: 9247253884
డా. శ్రీనివాస్ మోరంపూడి

SA: