వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళా పీఠం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏప్రిల్ 15 వ తేదీన వేమన నాటకం మరియు 16 తేదీన సంస్కరణోద్యమ ఖడ్గదారి కందుకూరి – సంగీత నృత్యరూపకం ప్రదర్శించబడును. సమయం సాయత్రం గంట.6.30 ని.లకుఅందరూ ఆహ్వానితులే…

వినురవేమ – నాటకం 400 సంవత్సరాల క్రితం తెలుగునాట వేమన జరిపిన సాంస్కృతిక పోరాటం విశేషమైన ప్రభావం చూపింది. మూఢ విశ్వాసాలకు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా హేతువాద దృష్టికి, సమానత్వ ధృక్పథానికి వేమన పతాకగా నిలిచారు. సంపన్నుల ఇంట పుట్టి, భోగభాగ్యాలు అనుభవించి తన జీవితంలోని ఉద్దాన పతనాల తర్వాత, యోగిగా మారి సమాజ స్థితిగతులను వివరిస్తూ అలతి.. అలతి పదాలతో వారు వ్రాసిన పద్యాలు ప్రజల నాల్కలపై చిరంజీవులుగా వర్ధిల్లుతున్నాయి. బ్రిటిష్ అధికారి సి.పి. బ్రౌన్ గారి విశేష కృషితో ఆ పద్యాలు వెలుగులోకి, బహుళ ప్రచారంలోకి వచ్చాయి. వినురవేమ నాటకం సి.పి.బ్రౌన్ గారి దృష్టికోణంలో ఆ ప్రాంత ప్రజల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందింది. వేమన సమకాలీకులైన కన్నడ ప్రాంత సర్వజ్ఞ, అక్కమహాదేవిలాంటి వారి పాత్రోచిత ప్రవేశం కూడా ఈ నాటకంలో అంతర్భాగంగా కొనసాగుతుంది. ఈ నాటక రచయిత డా. కె.వై.నారాయణస్వామి, ప్రొఫెసర్, బెంగుళూరు యూనివర్సిటి, దర్శకుడు బసవ లింగయ్య, డైరెక్టర్, ఎన్.ఎస్.డి, బెంగుళూరు.

సంస్కరణోద్యమ ఖడ్గదారి కందుకూరి – సంగీత నృత్యరూపకం కందుకూరి వీరేశలింగం పంతులుగారు 1848 ఏప్రిల్ 16న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈ సంవత్సరం 175వ జన్మదినం జరుపుకుంటున్నాము. బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు వివాహాలను జరిపిస్తూ, భౌతిక దాడులను ఎదుర్కొంటూ హితకారిణి సంస్థ ద్వారా సామాజిక సంస్కరణ దీక్షాధారిగా లబ్దప్రతిష్టులు. వందలాది పుస్తకాలను రచించారు. తెలుగునాట పాపులర్ సైన్స్ పుస్తకాల ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పాదుగొల్పారు. ఆరోగ్య పరిరక్షణ కోసం, భోగం మేళం పేర ఆనాడు సాగిన సంప్రదాయ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారు. అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం నిలబడ్డారు. చేతబడులు, దయ్యాలు లేవని సవాలుచేసి పోరాడిన యోధుడు. తన సర్వస్వాన్ని ప్రజల ఉన్నతికై త్యాగం చేశారు. వారి జీవిత సంగ్రహాన్ని ఈ నృత్యరూపకం ఆవిష్కరిస్తోంది. వారి ప్రహసనాలు కూడా కొన్ని పదర్శింపజేస్తున్నాము. నృత్యరూపక రచయిత కె. దేవేంద్ర, దర్శకుడు ఎమ్.జగ్గరాజు.

కార్యక్రమ సమన్వయ కర్తలు – డా. డి. శమంతకమణి మరియు శ్రీ గోళ్ల నారాయణ రావు

SA:

View Comments (1)