సేవకులను ఎప్పటికీ మరవదు – జస్టిస్ చంద్రయ్య

విశ్వగురువు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నిర్వహించిన స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డుల ప్రదానోత్సవ సభ హైదరాబాద్లో జనవరి 31 న ఘనంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కళా, సాంకృతిక, సేవా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ అవార్డులందుకున్నారు. సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యన తెలంగాణ రాష్ట్ర తొలి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఈ ప్రపంచం నాయకులను మరిచినా సేవకులను ఎప్పటికీ మరవదని అన్నారు.

పెద్ద-పెద్ద నాయకులను, ఆధ్యాత్మిక వేత్తలను ప్రపంచం మర్చిపోయినా సేవచేసే వ్యక్తులను ప్రపంచం ఎప్పటికీ మరువదని రాష్ట్ర తొలి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. తమ కోసం జీవించే వారి కన్నా ఇతరుల కోసం జీవించే ప్రతి ఒక్కరు దేశానికి ఆదర్శనీయమని అన్నారు.

Viswaguru World Record founder S. Rambabu speech at award ceremony

విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన వారికి అవార్డులు అందజేస్తున్నందుకు విశ్వగురువు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు సత్యవోలు రాంబాబును అభినందించారు. కూకట్​పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ ఛారిటబుల్ ట్రస్ట్ భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవ, సాహిత్యం, చిత్రలేఖనం, పాత్రికేయులు, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, విద్య, వైద్యం, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, మ్యాజిక్, నాటకరంగం తదితర అంశాల్లో సేవలందించిన 80 మందికి ఈ అవార్డులను ప్రదానం చేశారు.

అవార్డులందుకున్న వారిలో చిత్రకారులు స్వామి దంపతులు, లక్ష్మినారాయణ, కళాసాగర్ (ఎడిటర్:64కళలు.కాం) వున్నారు. పలు సాంకృతిక కార్యక్రమాలతో సభ ఆధ్యంతం ఆశక్తికంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ చైర్మేన్ హనుమంతరావు గారు, లయన్ ఎం. ప్రేమ కుమార్ గారు, రామకృష్ణ మఠం శ్రీ బ్రహ్మాచారి శ్యాం గారు డా. ఎం.ఆర్.ఎస్. రాజు గారు, విశ్వగురువు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ ఎస్. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

SA: