బొల్లు నరేష్ అల్లి’కళ’ చిత్ర ప్రదర్శన

ప్రయోగాలు చేయడంలో కళాకారుడు నిత్యాన్వేషి. ముప్పై ఆరేళ్ళ బొల్లు నరేష్ చిత్రకళా చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగంతో వినూత్న రంగుల చిత్రాలను రూపొందిస్తున్నాడు. సరికొత్త వ్యక్తీకరణతో తనదైన ప్రత్యేక “సిగ్నేచర్ శైలి’లో ఆ బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. ఆ బొమ్మల్ని గీయడం అనడంకన్నా “నేయడంలో అంటేనే బాగుంటుంది. ఏ చిత్రకారుడైనా బొమ్మల్ని వేస్తాడు… కాని నరేశ్ అల్లుతాడు… పోగులతో అల్లుతాడు. ఈ ప్రక్రియ వింతగా, వినూత్నంగా అనిపిస్తుంది.
తెలగాణాలోని చేనేత కుటుంబానికి చెందిన బొల్లు నరేశ్ చేనేత కార్మికుల పని విధానం తెలిసినవాడిగా ఈ ప్రయోగం’ ఆయనకు కొట్టిన పిండిలా అనిపించి నూలు వడకడాన్ని ఓ ఉద్యమంగా మార్చిన మహాత్మా గాంధీని ఆరాధిస్తూ గాంధీ బొమ్మల్ని తన ప్రత్యేక శైలిలో “అల్లాడు”.

బ్రిటీష్‌కు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేయాలనే పిలుపుగా మహాత్ముడు ప్రతిపాదించిన స్పిన్నింగ్ మరియు నేయడం సంప్రదాయాలలో వ్యక్తీకరణను ఈ సమకాలీన సందర్భంలో గాంధీ యొక్క ఆదర్శాలను తిరిగి కనుగొనడానికి కళాకారుడికి మరింత అవకాశం ఉంటుందని నమ్ముతున్నాడు నరేష్.

‘వీవింగ్ గాంధీ’ పేరుతో హైదరాబాద్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ లో నరేష్ తన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ ఫౌండర్ డా. ఆవని రావ్ గండ్ర ప్రారంభించారు. ఈ ప్రదర్శన అక్టోబర్ 23 వరకు కొనసాగింది. ప్రదర్శనలో నరేష్ 23 చిత్రాలతో పాటు మూడు ఇన్స్టలేషన్స్ వున్నాయి.

హైదరాబాద్ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుండి బి.ఎఫ్.ఏ. చేసిన నరేష్ పెయింటింగ్ లో జె.ఎన్.టి.యూ. నుంచి మాస్టర్ డిగ్రీ పొందాడు.
ప్రదర్శనను సందర్శించిన పలువురు నరేష్ చిత్రకళా ప్రతిభను అభినందించారు.

– కళాసాగర్ (9885289995)

Naresh works
artist and art lovers
SA:

View Comments (1)

  • బొల్లు నరేష్ గారు ఎన్నుకున్న అంశమే గొప్పదైన "జాతిపిత మహత్మాగాంధీ". అంత గొప్ప స్థాయిలోనే ఈయన చిత్రాలు కూడా కళా ప్రేమికులను మత్రముగ్ధులను చేస్తున్నాయి. వారికి అభినందనలు.