మహిళా శిరోమణి – వీణాపాణి

శ్రీమతి ఇండ్ల వీణాపాణి గారు, నివాసం ఫాదర్ బాలయ్యనగర్, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్.
బి.కాం. పూర్తి చేసి, ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బి.ఎఫ్.ఎ చదువుతున్నారు.
గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్ గా కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కళలపై మక్కువ ఏర్పడింది. తర్వాత చిత్రకళలో పార్ట్ టైమ్ కోర్సులు చేసారు.
2010 సంవత్సరం నుండి కళారంగంలో ప్రవేశం చేసారు. ఏడు సంవత్సరాల నుండి “వీణాపాణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్స్” ను స్థాపించి, పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. చిత్రకళలో సంవత్సరానికి రమారమి నాలుగు వందల మందికి శిక్షణ ఇస్తున్నారు. కళాప్రదర్శనలకు ఆర్గనైజర్ గా కూడా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో “కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ” ఆర్గనైజర్  రాంప్రతాప్ గారితో కలిసి “వీణాపాణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్స్” సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలను చేసారు. చిత్రకళలో ప్రోత్సహించే విధంగా జాతీయ స్థాయిలో పిల్లలకు పోటీలు నిర్వహిస్తున్నారు.
ఆయిల్ కలర్స్ పేయింటింగ్స్, అక్రిలిక్ కలర్స్ పేయింటింగ్స్, అలాగే వాటర్ కలర్స్, చార్ కోల్, మిక్సిడ్ మీడియా, స్కల్పచరింగ్, ప్రింట్ మేకింగ్, ఎగ్ టెంప్రా ఆర్ట్ మొదలగువాటల్లో ప్రావీణ్యం సంపాదించారు. అంతేకాదు పై వాటితోపాటు డ్రాయింగ్-పేయింటింగ్, ఆర్ట్-క్రాఫ్ట్, క్విల్లింగ్,కొల్లాజ్ వర్క్స్, లను నూతన పద్థతులలో టీచింగ్ చేయ్యగలరు.
ఇప్పటికి డెబ్భైకి పైగానే పేయింటింగ్స్ వేశారు. అందులో కొన్ని పేయింటింగులు సేల్ అయ్యాయని, కొన్నిటిని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందని వివరించారు వీణాపాణి గారు. ఆర్డర్ పై కూడా చేస్తుంటారు.
•వంద గంటలుపాటు నాన్ స్టాప్ గా వర్క్ షాపులో పేయింటింగ్ వేసే ప్రక్రియకు “ఓ రికార్డును”,
•స్కోర్ మోర్ ఫౌండేషన్ నుండి “మహిళా శిరోమణి” అవార్డ్ ను,
•సంఘమిత్ర కల్చరల్ అసోషియేషన్ నుండి “ప్రతిభా రత్న” అవార్డ్, మరియు “మహిళా ప్రతిభా అవార్డును,
•సూర్యచంద్ర క్రియేషన్ నుండి “యన్.టి.ఆర్ ఎక్సెలెన్స్” అవార్డ్ ను,
•సృజన ఆర్ట్స్ & కల్చరల్ ట్రస్ట్ నుండి “ఉగాది పురస్కారం” అవార్డ్ లను అందుకున్నారు.
అనేక గ్రూప్ ప్రదర్శనలలో పాల్గొన్నారు.
మనసులోని ఆలోచనలతో, రంగులతో చిత్రాలను క్యాన్వాస్ పై చూపించే కళ ఈ చిత్రకళ. అంతటి శక్తి కలిగిన ఈ కళారంగంలో పూర్తి సమయం కృషిచేస్తున్నానన్నారు వీణాపాణి.
ఇండియాలో గల రాష్ట్రాలలోని, వివిధ ప్రాంతాల వారీగా ఉన్న వివిధ కళలన్నీ “దేశవ్యాప్తంగా” తెలియజెయ్యాలని తన ఆశయంగా చెప్పటం జరిగింది.
చివరిగా “టీచర్ విధ్యతో సమాజాన్ని మార్చగలరని, అలాగే కళాకారుడు తన కుంచె తో సమాజాన్ని ఆలోచింపజేయగలరని, కళ ఎదుటి వారు ఆస్వాదించే విధంగా ఉండాలని” వివరించారు శ్రీమతి ఇండ్ల వీణాపాణి.

– డా. దార్ల నాగేశ్వర రావు

SA: