తెలుగుతల్లి సిగలోంచి రాలుతున్న పువ్వు

ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సముపార్జనకు ముందే, ఎంతో ముందుచూపుతో 1923 లో లక్ష రూపాయల పెట్టుబడితో బందరులో ఆంధ్రా బ్యాంక్ స్థాపించారు. మన తెలుగు ప్రజల ఏకైక పెద్ద బ్యాంక్ ఇదే. 1980లో జాతీయం చేయబడిన ఈ బ్యాంక్ 96 సుదీర్ఘ సంవత్సరాల ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించి 220 లక్షల కోట్ల డిపాజిట్లు సాధించి 160 లక్షల కోట్ల అప్పులు ప్రజలకు పంచింది. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 16 జిల్లాలలో అగ్రగామి(lead) బ్యాంక్ గా విలసిల్లుతూ, 2900 శాఖలతో, 22000 మంది సిబ్బందితో 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి, రైతు సంక్షేమ బ్యాంక్ గా మన్ననలు అందుకుంది. బ్యాంక్ consolidation ముసుగులో ప్రభుత్వం ఈ బ్యాంక్ ను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్ లతో కలిపి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.
తెలుగు ప్రజలకు ఇదో శరాఘాతం. తెలుగుతల్లికి జరుగుతున్న అవమానం. తెలుగువారి ఉనికిని ప్రశ్నార్థకం. తెలుగు వారంటే అందరికీ లోకువే!

SA: