జర్నలిస్టులకు మంత్రి వెలంపల్లి హామీ

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ  అర్బన్ నేతలకు మంత్రి వెలంపల్లి హామీ

కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపచేయాలని ఏపీయూడబ్ల్యూజే నేతలు మంత్రి ని కోరారు. సోమవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, రాజేశ్వరరావు కొండా , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావులు రాష్ట కమిటీ పిలుపు మేరకు మంత్రికి వినతిప్రతం సమర్పించారు. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులందరికీ పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకం గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసినందున 2020-21 సంవత్సరానికి కూడా అంతరాయం లేకుండా కొనసాగేలా ఆదేశాలివ్వాలని వినతి పత్రంలో కోరారు. అలాగే జర్నలిస్టుల వైద్య ఆరోగ్య సేవలకు అత్యధిక పాత్రికేయులకు సరైన వేతన వ్యవస్థ లేదని వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమాజంలో వివిధ వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహకారాన్ని పాత్రికేయులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దాంతో స్పందించిన మంత్రి వెల్లంపల్లి మీ సమస్యలను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ లు కరోన నేపథ్యంలో ఏదుర్కొంటున్న సమస్యలపై సమచారశాఖ మంత్రి నానితో కూడా ఓసారి మాట్లాడతానని తెలిపారు.

SA: