ఎదురులేని ‘వెదురు ‘ కళ

వెదురుతో ఎన్నో కళాఖండాలు (bamboo craft work) తయారు చేయవచ్చు. ఆదిలాబాద్ కు చెందిన కిరణ్, మంజూష దంపతులు ప్లాస్టిక్ వస్తువులకు ఆల్టర్నేట్ గా వెదురుతో ఇంట్లో వాడే వస్తువులు, డెకరేషన్ పీస్టు తయారు చేస్తున్నారు. సోఫా సెట్లు, ల్యాంప్ సెట్లు, వాటర్ బాటిల్స్, ఫొటో ఫ్రేమ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, కిచెన్ సెట్స్, ఫ్లవర్ వేజ్, గిఫ్ట్ బాక్స్క్లు వెదురుతో చేసినవే. అలాగే గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా బొమ్మలు కూడా తయారుచేస్తున్నారు. వాళ్లు చేసిన వాటిలో ఎడ్లబండి, నెమలి, పిచ్చుకలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలోని యువతకు కూడా ఈ కళను నేర్పుతున్నారు. ఆదిలాబాద్లోని రైతు బజార్ లో ఒక స్టాల్ పెట్టి, అందులో ఈ అందమైన వెదురు వస్తువులును అమ్ముతున్నారు. తెలంగాణా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ నుండి స్టేట్ అవార్డ్ అందుకున్నారు కిరణ్.

SA: