కోవిడ్-19 పై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు

కోవిడ్-19 గురించి అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా ఆన్లైన్ పెయింటింగ్ కాంపిటేషను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, ది హేన్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో వివిధ కేటగిరిల్లో టాపిక్ వైస్ నిర్వహించనున్నారు. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు వారు నచ్చిన అంశంలో డ్రాయింగ్ వేసి పంపవచ్చు. 1, 2వ తరగతి విద్యార్థులు హైజీన్ కార్యక్రమంపై, 3, 6వ తరగతి విద్యార్థులు వైద్యం, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులు మన నేచర్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు అంటువ్యాధులు లేదా మహమ్మారిల నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి అనే దానిపై, ఇతరులు కరోనా వైరస్ పై పబ్లిక్ రెస్పాన్సిబిలిటీపై పెయింటింగ్లు వేయాలన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు 50 మెరిట్ అవార్డులు అందజేస్తారు. అన్ని గ్రూపుల వారు రూ. 100 పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలి. ఈ నిధి ని పి.ఎం.కేర్స్ ఫండ్ కి విరాళంగా ఇవ్వనున్నారు. వివరాలకు సెల్: 9959971679, 9618897229, 8919681279 నెంబర్లలో సంప్రదించవచ్చు.  లేదా : http://www.satguruart.com/  పెయింటింగ్ లు మే 15 వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి.

SA: