మీనాక్షి కల్యాణం నృత్యరూపకం
December 19, 2021ఆదిదంపతులయిన పార్వతీపరమేశ్వరుల తాండవంలో శివుని నృత్యంలో అపశృతి దొర్లి పార్వతి శివుని దూషించగా…శివుడు ఆగ్రహించి… భూలోకంలో పార్వతి మూడు స్తనముల వికృత రూపంతో జన్మించమని శపిస్తాడు. దుఖంలో వున్న పార్వతిని విష్ణుమూర్తి ఓదారుస్తూ… పాండ్యరాజ్యంలో మలయధ్వజ మహారాజు కూతురుగా జన్మిస్తావని తడాదకై (అజేయరాలు)అనే పేరుతో ప్రభవించి ఈశ్వరుని దర్శనంతో శాపవిముక్తి కలిగి, అతనినే పరిణయమాడి మీనాక్షి సుందరేశ్వరులుగా భూలోకాన్ని…