అందుకే ‘యాంటీ మోడీ కార్టూన్స్ గీస్తున్నా’ – శ్రీవల్లి

శ్రీవల్లి అన్న అమ్మాయి పేరుతో గత మూడు దశాబ్దాలుగా అభిరుచి తో కార్టూన్లు గీస్తున్న పి.వి. రావు గారు ‘ఈనాడు’ పత్రిక లో చీఫ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికలో ఈ నెల పరిచయం వారి మాటల్లో చదవండి….

అసలు పేరు పోలిశెట్టి వీరభద్రరావు కలం పేరు శ్రీవల్లి. అన్నయ్యగారి అమ్మాయి అంటే అభిమానంతో ఆమె పేరుతో కార్టూన్లు గీయడం ప్రారంభించా. అయితే ఆ సిగ్నేచర్ అందరికీ అలవాటు అయిపోవడంతో మార్చకుండా అలాగే కంటిన్యూ అయిపోయా.
తొమ్మిది మంది సంతానంలో ఆఖరి తొమ్మిదోవాడ్ని. తూ. గో. జిల్లా అమలాపురంలో పుట్టి పెరిగి డిగ్రీ వరకూ 23 ఏళ్లు ఆంధ్రాలో ఉంటే… గత 27 ఏళ్లుగా తెలంగాణాలో స్థిరపడ్డాను. ఉద్యోగరీత్యా ఈనాడులో డిప్యూటీ చీఫ్ ఆర్టిస్ట్’గా ప్రస్తుతం పని చేస్తున్నాను. నా వైఫ్ పేరు శారదాదేవి, ముగ్గురు పాపలు. పెద్దామె ఆస్ట్రేలియా, రెండో ఆమె హైదరాబాద్ లో జాబ్, చిన్న పాప ఇంటర్ చదువుతుంది. ఉండేది బంజారా హిల్స్ రోడ్ నెం.1 కేర్ హాస్పటల్ దగ్గర, హైదరాబాద్.
1980లో నా 10 తరగతి పరీక్ష రాసే సందర్భంలో డిబార్ చేయబడ్డాను. తిరిగి మళ్లీ పరీక్షలు అక్టోబర్లో ముగించాకా 6 నెలలు ఖాళీ దొరికింది. ఆ టైంలో నాకు నేనుగా కార్టూన్లు గీయడం నేర్చుకుని అలా అలా డెవలప్ చేస్కుంటూ అన్ని పత్రికలలో వేలకొద్దీ కార్టున్లు అనేక సబ్జెక్టులపై గీసాను. స్పార్క్ ఉండేలా సెటైర్గా పంచ్ కొట్టేలా కార్టూన్లు ఉండాలని తాపత్రయ పడ్డాను. మొదటి కార్టూన్ 1981 అంధ్రపత్రిక లో అచ్చయ్యింది. 
కార్టూన్లను అంటే జనరల్ కార్టూన్లను ప్రోత్సహించే పత్రికల ఉనికి 1992 నుండి పతనం స్టార్ట్ అయ్యింది. కారణం.. సాటిలైట్ ఛానల్స్ మొదలైయ్యాయి. జనాల్లో రీడర్ షిప్ తగ్గిపోయింది. తద్వారా వార, పక్ష, మాస పత్రికలు కనుమరుగవ్వడంతో ప్రోత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. 2005 వరకూ ఈనాడు సిటీ హైదరాబాద్ ఎడిషన్లో ఒకటి అరా గీసాను. కార్టూన్లు అనేవి సెల్ఫ్ సేట్సీ ఫేక్షన్ తప్ప అవి కూడూ, గుడ్డా పెట్టవు. తరువాత మనం బతకడానికి ఉపయోగపడే వృత్తిమీదే డెవలప్ అవడంతో 2016 వరకూ చాలా వరకూ కార్టూన్లు గీయడం ఆగిపోయింది. పనిచేస్తున్న సంస్థలో కూడా వాళ్లకి టెక్నికల్గా రోజూ ఉండే పనినే చేయించుకుంటారుగానీ… మనం కార్టూన్లు వేసినా వాళ్లు పెద్దగా పట్టించుకోరు.

ఈ మధ్య అంటే 2016-17 నుండి వాట్సాప్ గ్రూపులు, లోకల్ పోటీల ద్వారా కొంత వరకూ కార్టూన్ వైభవం వచ్చినా… ఆయా వాట్సాప్ గ్రూపులు వ్యక్తిగత పొగడ్తలు, అనవసర వాదనలతో పాటు పొలిటికల్ వి పోస్టు చెయ్య కూడదన్న కండీషన్స్ ఎక్కువైయ్యాయి. ఇలాంటి టైంలో నోట్లరద్దువల్ల నాకు వ్యక్తిగతంగా లక్షల రూపాయలు పోయాయి. దాంతో మోడీమీద విపరీతమైన ఏవగింపుతో ఫేస్బుక్ వేదికగా “యాంటీ మోడీ కార్టూన్స్’ మొదలుపెట్టి కంటిన్యూగా వందలకొద్దీ గీసాను. గీస్తున్నాను. అంతే కాకుండా జగన్, పవన్, టీఆర్ఎస్ మీద కూడా గీస్తున్నా. దాంతో కొన్ని గ్రూపులు ఆయా కార్టూన్సు విపరీతంగా షేర్ అవుతున్నాయి. బీజేపీ మీద వెయ్యడాన్ని కొందరు వ్యతిరేకించారు. బూతులతో కామెంట్లు పెట్టినా.. గీస్తూనే ఉన్నాను. నిజానికి నేను పొలిటికల్ కార్టూనిస్ట్ ని కాను. నాకు ఆ అనుభవం కూడా లేదు. కానీ… సెటైర్కల్గా మిక్స్ చేస్తూ పంచ్ వచ్చేలా గీయడంతో బాగా సర్వే అవుతున్నాయి. పత్రికల్లో గియ్యాలంటే రకరకాల కండీషన్స్ ఉంటాయి. ఫేస్బుక్ తో సామాన్యుడు ఎలా ఫీల్ అవుతాడో దాన్నే ధైర్యంగా పబ్లిక్ కి చూపించొచ్చు.
1999లో శ్రీవల్లి కార్టూన్లు పేరుతో ఓ కార్టూన్ బుక్ రిలీజ్ చేసాను. మళ్లీ 20 సం. తరువాత భారీ ఎత్తున మొత్తం కలర్ కార్టూన్లతో “ఏంటీ మోడీ కార్టూన్స్’ని పుస్తకంగా తీసుకురాబోతున్నా. ఎంత కార్టూన్లు గీసినా.. మన బతుకు మారకపోయినా అదొక ఐడెంటిటీ. రేపు ప్యూచర్లో మనకి గుర్తింపుగా మిగిలేదదొకటే… మనకి తెలిసిన విద్య అదొకటే కాబట్టి నడిచిపోతుంది జీవితం.
అనేక కార్టూన్ పోటీల్లో పాల్గొని కొన్ని బహుమతులు కూడా తెచ్చుకున్న. అందులో వెంకట్ అవార్ద్ (1982), క్రోక్విల్ అవార్ద్ (1982), యాసియన్ గేంస్ అవార్ద్ లాంటివి వున్నాయి.

17 thoughts on “అందుకే ‘యాంటీ మోడీ కార్టూన్స్ గీస్తున్నా’ – శ్రీవల్లి

  1. శ్రీవల్లి గారు, నమస్తే, కోనసీమ కార్టూనిస్టులలో మీదో ప్రత్యెక శైలి..గుర్తింపు..ప్రారంభ దశలో కార్టూనిస్ట్ గా నేను మారడానికి అమలాపురం లో మీ ఇంటి వద్ద ఇచ్చిన సూచనలు నేను ఇంకా మర్చిపోలేదు..Thank you sir.
    కార్టూనిస్ట్ M.రాము,బండారులంక.

  2. I love your cartoons.
    మీ కార్టూన్ పుస్తకం ఇప్పటి వరకు ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. మిమ్మల్ని హైదరాబాద్లో కలవటం మంచి జ్ఞాపకం. మోడీ,జగన్,పవన్ల మీద మరీ దారుణంగా వేస్తున్నారు. పంచ్ తగ్గుతోంది వీటిలో….

  3. మిత్రులు శ్రీవల్లి గారి కార్టూన్లది ప్రత్యేక శైలి. తమదైన బాణీలో పిల్లలకు సైతం సులభగ్రాహ్యంగా ఉండడం వీటి ప్రత్యేకత ! మోడీ గారి మీద వారికోపానికి కారణం ఇప్పటికి నాకు తెలిసింది. వారి పరిచయ భాగ్యం కలిగించిన “64 కళలు” వారికి ధన్యవాదాలు. అంబటి చంటిబాబు, కార్టూనిస్ట్

  4. బాగుంది శ్రీ వల్లీ గారి పరిచయం.
    బొమ్మలు చాలా బాగుంటాయి.

  5. బాగుంది శ్రీ వల్లీ గారి పరిచయం.
    బొమ్మలు చాలా బాగుంటాయి.

  6. నా అభిమాన కార్టూనిస్టుల్లో మీరొకరు..నవ్వించే బొమ్మలు,పవర్ ఫుల్ సెటైర్ మీ సొంతం..మీ ఆటోగ్రాఫ్ తో సహా మీరిచ్చిన మీకార్టూన్ల పుస్తకం నాకో తీపి జ్ఞాపకం..ప్రస్తుతం మీరు AMC పేరుతొ గీస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి..మీ విజయ యాత్ర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ…
    ప్రభాకర్(కార్టూనిస్ట్)

  7. మీ కార్టూన్లు బాగుంటాయి. సెటైర్ మరీనూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap