“రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 11వ జాతీయస్థాయి “సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి గతంలో కంటే అత్యధికంగా 157 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో అనకాపల్లికి చెందిన కోయిలాడ రామ్మోహనరావు రాసిన ‘సార్ధకత’ కథకు ప్రథమ సోమేపల్లి పురస్కారం లభించింది.
అలాగే బండి ఉష (ఖమ్మం) రాసిన “పండగొచ్చింది’కు ద్వితీయ, వెంకటమణి ఈశ్వర్ (విశాఖపట్నం) రాసిన ‘దేవుడి మార్కులు’కు తృతీయ పురస్కారాలు లభించాయి.
మొలుగు రవికృష్ణకుమారి (విజయవాడ) రాసిన ‘విజయదశమి’, మాధవరపు కృష్ణ (కాకినాడ) రాసిన ‘పుట్టినరోజు’, సుసర్ల మాధవి (నరసారావుపేట) రాసిన “ఆత్మహత్యకు కోచింగ్ సెంటర్, వలివేటి నాగచంద్రావతి (విజయవాడ) రాసిన ‘ఆకలి’, బెహరా వెంకట సుబ్బారావు (రాజమండ్రి) రాసిన ‘లక్ష్యం’ కథలకు ప్రోత్సాహక పురస్కారాలు లభించాయి.
విజేతలకు వరసగా 2,500, 1,500, 1,000, ప్రోత్సాహకం 500 నగదుతోపాటు జ్ఞాపిక, శాలువతో త్వరలో జరిగే ప్రత్యేక సభలో సత్కరించడం జరుగుతుంది. ఈ పోటీలకు ప్రఖ్యాత రచయిత విహారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
Hearty congratulations to the winners!