నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర ఓటర్లు ఆయన మీద చూపించిన అభిమానం తిరుగులేనిది. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిం చారు. తాము మార్పును కోరుకుంటున్నామని, సరి కొత్త పాలకుడు కావాలనుకుంటున్నామన్న సందేశం ఓటుద్వారా తెలియచెప్పారు.
మునుపెన్నడూ ఏ పార్టీకీ ఇవ్వనంత మద్దతు వైకాపా పార్టీకి, దాని నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఎన్నికల ప్రచార సమయంలో మారు మోగిన ‘కావాలి జగన్… రావాలి జగన్’ అనే ప్రచార పాటను ఓటర్లు సీరియస్గానే తీసుకుని స్వాగతించారు. నలభైఏళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు నాయుడుకన్నా, ఆయన అనుభవంకన్నా తక్కువ వయసున్న యువనేత వల్లనే తమ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు భావించారు.
దాని ఫలితమే 50 శాతం ఓట్లు వైకాపా పక్షానికి దక్కటం. 175 సీట్లు వున్న అసెంబ్లీలో 151 మంది ఎమ్.ఎల్.ఎలు వైకాపా పరమవటం. ఈ గెలుపులో జగన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు.
ఓట్లశాతం,సీట్ల సంఖ్యపరంగా ఒక రికార్డ్ అయితే, తండ్రి ఆక్రమించిన సి.ఎమ్. సీటును అందుకున్న నేతగా మరో రికార్డు అందుకున్నాడు..
తండ్రి, కొడుకు ఒకే నేతను ఓడించడం ఒక విశేషం. ఒక కొత్తగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ తొలి ఎన్నికలో గెలవకపోతే, ఆ తర్వాత ఎన్నడూ అధికారం లోకి రాలేదన్నది చరిత్ర. ఆ చరిత్రను తిరగరాశాడు జగన్ ఈ గెలుపుతో..
ఇప్పుడిక వైఎస్ జగన్ శకం ప్రారంభమైంది. వైఎస్ జగన్ కి తెలుసు, ముఖ్య మంత్రి పదవి అంతా ఆషామాషీ కాదని. మరీ ముఖ్యంగా చంద్రబాబు పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఎలా తిరిగి గట్టెక్కించాలి.? అన్నదానిపై ఆయనకు ఓ ఐడియా ముందే ఉండి ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రిగా బాధ్య తలు తీసుకుని, సమీక్షలు మొదలు పెట్టాక, అంతకుమించిన అగాధాల్ని దాదాపు అన్ని శాఖల్లోనూ చూస్తున్నారు. ఒకదాన్ని మించి ఇంకోదాంట్లో లోటు పాట్లు కనిపిస్తు న్నాయి. సీఎం వైఎస్ జగన్ – ఆశ్చర్యం, ఆందోళన
గత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రతిపక్ష నేతగా ఎండగట్టిన వైఎస్ జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాటిల్లోకి తొంగి చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకొకరెవరైనా అయితే, భయపడాల్సిన పరిస్థితి అని అనుకుంటున్నారంతా. అమ రావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానిం చిన చంద్రబాబు, ఆ కార్యక్రమం కోసం చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ విషయమై చాలా విమర్శలు వచ్చాయి. కానీ, చంద్రబాబు తెలివిగా తిమ్మిని బమ్మిని చేవారు. చేసిన ఖర్చు తగ్గించి చూపారు. ఆ ఖర్చు తాలూకు వాస్తవాలు ఇప్పుడు అధికారులు, జగన్ ముందుంచారట. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణల కంటే, ఎక్కువే ఖర్చయ్యిందన్న మాట..’ అని జగన్ మనసులో అనుకున్నారట. ఇది మచ్చుకో ఉదాహరణ మాత్రమే. దుబారా కేరాఫ్ చంద్రబాబు
ధర్మ పోరాట దీక్షలు, విదేశీ పర్యటనలు, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అంటూ చేపట్టిన పలు రకాల సమ్మి ట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కథ చాలానే ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వీటిన్నింటిపైనా ఓ చూపు చూడబోతున్నారు. రేపొద్దున్న జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.? అన్నది వేరే చర్చ. ఇప్పటికైతే వాస్తవ పరిస్థితుల్ని ఇంకా దగ్గరగా ముఖ్యమంత్రి హెూదాలో చూ స్తున్న వైఎస్ జగన్, కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటేనే కత్తి మీద సాము లాంటి పరిస్థితి. విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బం దులు ఎదుర్కొంటోన్న ఆంధ్రప్రదేశ్ ని మరింత సంక్షోభం లోకి చంద్రబాబు నెట్టేశాక కనీసం తిరిగి సాధారణ స్థితి కైనా తీసుకురావాలంటే పడరాని పాట్లు పడాల్సిందే కొత్త ప్రభుత్వం. మరి కొత్త సంక్షేమ పథకాల మాటేంటీ.? ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ ముందున్న అతిపెద్ద సమస్య. సంక్షేమమే పెనుసవాల్ పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పారు. రైతన్నకు భరోసా కల్పించేందుకు ముందుకొచ్చారు. ఇవన్నీ మంత్రి వర్గం ఏర్పా టుకు ముందే తీసుకున్న సంచలన నిర్ణయాలు. మంత్రి వర్గ ఏర్పాటు తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబో తున్నారు వైఎస్ జగన్. దోచుకున్నదీ తిరిగి రాబట్టడం ద్వారా కొంత మేర ఆర్ధిక ఉపశమనం పొందవచ్చనే ఆలో చన కూడా చేస్తోంది జగన్ ప్రభుత్వం. నిజానికిది చంద్రబాబు, తన ఐదేళ్ల పాలనలో ఊదరగొట్టిన మాట. మాటలు తప్ప చేతల్లేని చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన మాట వాస్తవం. పప్పు బెల్లాల్లా ప్రజాధనాన్ని అడ్డగోలుగా అనూయాయీలకి చంద్రబాబు పంచేశారు. కానీ, అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తే, అంతే సంగతులు. ఆ భయం చంద్రబాబులో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ దాడులు జరుగుతాయి. కక్ష సాధింపులు తప్పవు.. అంటూ పార్టీ శ్రేణుల్ని అప్పుడే చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనే లేదు. నిప్పులా బతికానని చెప్పుకునే చంద్రబాబు ఇలా ఇప్పుడు తప్పులా ఆందోళన చెందడం నిజానికి ఆశ్చర్యకరమేమీ కాదు. చరిత్రకెక్కాలంటే.. సంక్షోభంలోంచి గట్టెక్కించాల్సిందే చంద్రబాబు సంగతి పక్కన పెడితే, ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన గురుతర బాధ్యత వైఎస్ జగన్ మీద ఉంది. ఒక్కసారి కాదు, వరుసగా మూడు, నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనే ఆకాంక్షతో ఉన్న వైఎస్ జగన్, అందుకు తగ్గట్లుగా మెరుగైన పాలనకు సకల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా అవినీతికి అవకాశం లేని పాలన చేసి చూపిస్తామంటున్నారు. చేతల్లో అంత తేలికైన పని కాదిది. కానీ, ప్రయత్నమంటూ మొదలెడుతున్నారు కనుక, ఆ ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం..
సంక్షోభంలో అవకాశాన్ని దక్కించుకున్న వైఎస్ జగన్, ఆ సంక్షోభం నుండి ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించగలిగితే, పాలకుడిగా తెలుగునాట తిరుగులేని చరిత్ర సృష్టించిన వారవుతారు.