నేలకొరిగిన సాహితీ శిఖరం

సాహితీ ప్రపంచానికి అద్భుత రచనలు అందించిన ఓ కలం ఆగిపోయింది. ఏ పక్షంలో ఉన్నా.. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై గొంతెత్తే గళం మూగబో యింది. ఐదు దశాబ్దాలకుపైగా సినీ, నాటక రంగంపై తనదైన ముద్రవేసిన ఓ లెజెం డరీ నటుడి ప్రయాణం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, నటుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్(81) జూన్ 10, సోమవారం తుది శ్వాస విడిచారు.
ఆయన కొంతకాలంగా అనారోగ్య సమ స్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని తన నివాసంలోనే ఊపిరితిత్తుల సంబంధ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారని, తాము ఉదయం 8:30 గంటలకు గుర్తిం చామని కర్నాడ్ కుమారుడు రఘు ఒక ప్రకటనలో తెలిపారు. గిరీశ్ కర్నాడ్ కు భార్య సరస్వతి, కుమారుడు రఘు కర్ణాడ్, కూతురు రాధ ఉన్నారు. కర్నాడ్ మరణవార్త విని ఆయన అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం ఒక్క సారిగా మూగబోయింది. వివిధ రంగాల ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కర్నాడ్ ఆకాంక్ష మేరకు అంత్యక్రియలను కుల, మతాచారాలకు అతీతంగా, నిరాడంబరంగా నిర్వ హించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదించినా నిరాకరించారు. కర్నాడ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించాలనుకునేవారు నేరుగా శ్మశానానికే రావాలని విన్నవిం చారు. సోమవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహానికి కల్పాలి శ్మశానంలోని విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహిం చారు. కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశపాండే, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు శ్మశానానికి చేరుకొని, ఆయనకు కన్నీటివీడ్కోలు పలికారు. కర్నాడ్ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రం ఒక సాంస్కృతిక రాయబారిని కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. మూడు రోజులు సంతాపదినాలుగా నిర్వహించాలని ఆదేశించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
గిరీశ్ కర్నాడ్ కన్నడ భాషలో అనేక నాటకాలు, పుస్తకాలు రచించారు. ఆయన మొదటి పుస్తకం ‘యయాతి’ 1961లో ప్రచురితమైంది. పాండవ వంశీకుల్లో ఒకరైన యయాతి మహారాజు కథ ఆధారంగా కర్నాడ్ దీన్ని రచించారు. ఇది విశేష పాఠకాదరణ పొందింది. అనేక భాషల్లోకి అనువాదమైంది. దీంతో ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇతిహాసాలు, చారిత్రాత్మక అంశాలకు అన్వయిస్తూ రచనలు చేయాలని కర్నాడ్ నిర్ణయించుకున్నారు. ఆయన రెండో రచన తుగ్లక్ 1964లో ప్రచురితమైంది. ఇది ఆయనకు దేశంలోనే గొప్ప నాటక రచయితల్లో ఒకరిగా స్థానం కల్పించింది. ఈ నాటకాన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రదర్శించారు. 1982లో లండ న్లో నిర్వహించిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఫెస్టివల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. 1988లో ఆయన రచించిన ‘నాగమండల’కు కర్ణాటక రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ నాటక ఆంగ్ల అనువాదాన్ని అమెరికా షికాగోలోని ప్రఖ్యాత ‘గుత్రీ థియేటర్’ 30వ వార్షికోత్సవంలో ప్రదర్శించారు. వీటితోపాటు తలెదండ, వీర శైవం వంటి అనేక రచనలు చేశారు. నటుడిగా, దర్శకుడిగా, సామాజిక వేత్తగా రాజకీయ నాయకుడిగా కర్నాడ్ తనదైన ముద్రవేశారు. 1970లో మొదటిసారిగా సంస్కార అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా.. ‘రాష్ట్రపతి బంగారు కమలం’ అవార్డును గెలుచుకున్నది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో ఆయన నటించారు. చివరగా సల్మాన్ ఖాన్ హీరోగా 2017లో విడుదలైన ‘టైగర్ జిందా హై’ చిత్రంలో నటిం చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రచన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ఆడియో బుక్కు కర్నాడ్ గాత్రం అందించారు. టీవీరంగంలోనూ కర్నాడ్ తనదైన ముద్ర వేశారు. మాజీ రాష్ట్ర పతి ఆర్కే నారాయణ్ రచించిన మాలుడి కథలు ఆధారంగా 1986-87లో వచ్చిన సీరియల్లో కర్నాడ్ నటించారు. 1990ల్లో దూరదర్శన్ లో ప్రసారమైన ‘టర్నింగ్ పాయింట్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
నటుడిగా..
గిరీశ్‌కర్నాడ్‌ నటించిన తొలిసినిమా.. ‘సంస్కార’. 1970లో విడుదలైన ఆ సినిమా రాష్ట్రపతి స్వర్ణకమలం అందుకుంది. ఆ తర్వాత నిశాంత్‌, మంథన్‌, స్వామి సినిమాల్లో నటించారు. దర్శకుడుగా వంశవృక్ష, గోధూళి, ఉత్సవ్‌ వంటి చిత్రాలు తీశారు. ‘టైగర్‌ జిందాహై’, ‘శివాయ్‌’ వంటి కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటించారు. ‘ఆనందభైరవి’, ‘ధర్మచక్రం’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించిన గిరీశ్‌ కర్నాడ్‌కు తెలుగులో ఆఖరి చిత్రం ‘కొమరం పులి’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap