“కళ” అన్న పదాన్ని ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచించినా వ్యక్తి తనలో కలిగిన సృజనాత్మక శక్తితో ఎదుటవారిని రంజింప జేయాడానికి చేసే ఒక ప్రయత్నం” కళ “ అని చెప్పవచ్చు .ఆ కళ ద్వారా సమాజాన్ని ఆనందింప జేయడం మాత్రమే గాక వ్యక్తి తాను తన కుటుంభం కుడా అన్నివిధాలా ఆనందం పొందినప్పుడు ఆ కళ కు మరింత సార్ధకత ఏర్పడుతుంది. దురద్రుష్టవశాత్తు ఆ అదృష్టం అందరిని వరించదు. కొందరికే ఆ అదృష్టం దక్కుతుంది.
పరిమితమైన ప్రతిభతో అపరిమితఖ్యాతి గడించేవాళ్ళుకొందరైతే
అపరిమితమైన ప్రతిభ ఉన్నప్పటికీ తగిన ఖ్యాతికి, ఆర్ధిక స్థితికి నోచుకోని వాళ్ళు మరి కొందరు.
సింహపురి నుండి వచ్చిన ఓ ఆ చిన్న కుర్రాడు చిన్నతనము నుండే రంగుల కళను గురించి అందమైన కలలు కన్నాడు .ఆ కళను సాకారం చేసుకునేందుకు భాగ్యనగరంలో చిత్రకళాశాలలో చేరి తన కళకు వన్నెలు అద్దుకున్నాడు ,అంతే కాదు ఎందరో శిష్యులను మంచి కళాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళ అందమైన భవిష్యత్తుకు బాటలు వేసాడు ,కాని తాను మాత్రం దానిని సాదించు కోలేకపోయాడు .ఇప్పుడు హైదరాబాదు లోని మియాపూర్ దగ్గర మదీనగూడ నందలి ఒక అపార్ట్మెంట్ లో అతను సృష్టించుకున్న అందమైన కళా సామ్రాజ్యం లో తాను సృష్టించిన సుందరమైన చిత్ర లతాంగుల మధ్య నిర్వేదం లాంటి భావనతో కాలాన్ని ముందుకు తోస్తూ జీవనయానం సాగిస్తున్నారు .అయినప్పటికీ తన కళా సృజనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు . నిర్వేదాన్ని పక్కన బెట్టి నిరంతరం ఆశావహ దృక్పదంతో కళా సృజన చేస్తూనే వున్నారు .కారణం అది అతని బలహీనత ,అంతే కాదు అతని బలం కూడా .చిత్రం అతని ఊపిరి .అది పీల్చకుండా మనిషి ఎలా జీవించలేడో చిత్రాన్ని గీయకుండా కూడా అతను ఉండలేడు.చిత్రకళతో అంతలా మమేకమైపోయిన ఆ చిత్రకారుడే సింహపురికి చెందిన సిరాజుద్దీన్ .
2003 లో అనుకుంటాను హైదరాబాదు నందలి సృష్టి ఆర్ట్ గేలరీలో సిరాజుద్దీన్ చిత్రాలను తొలిసారిగా నేను చూడడం జరిగింది . వైట్ హ్యాండ్ మేడ్ షీట్ పై జల వర్ణాల్లో అతడు సృష్టించిన అందమైన అమ్మాయిల చిత్రాలను చూసినప్పుడు ఒక్కసారిగా మనసుపులకరించడమేకాదు, ఒక సుందరమైన రంగుల వనంలో విహరించిన అనుభూతి. చిత్రకళలో స్త్రీ మూర్తుల కల్పనలో ఒక కవితామయ వర్ణనతో కూడిన అందమైన హొయలు లయలు తీసుకువొచ్చిన గొప్ప చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు గారు . మన ప్రాచీన సాహిత్యము నందలికావ్యాత్మక వర్ణనతో కూడిన ధోరణి వీరి స్త్రీ మూర్తుల కల్పనలో వుంటుంది .దానికి నేపధ్యంలో విస్తుగోలిపే ప్రకృతి చిత్రణను శేషగిరిరావు గారి శాకుంతలం సిరీస్ పై వేసిన చిత్రాల్లో మనం చూస్తాము .హైదరాబాదు చిత్రకళాశాలలోని శేషగిరిరావు గారి శిష్యులలో ఒకరైన సిరాజుద్దీన్ పై ఆ శైలి ఒక బలమైన ముద్ర వేసినట్లుగా కనబడుతుంది.
సిరాజుద్దీన్ చిత్రాలు అనగానే వెంటనే ఎవ్వరికైనా మనసులో స్పురించేవి అందమైన సుందరాంగులు, సుందర లావన్యంతో కూడిన కోమలాంగులు ,సొగసరి భామలు, ఒయ్యారి నారీ మణులు. లలితమైన రేఖా లావన్యంతో కూడిన లతాంగులు, పూబోణీలు ఇలా ఒకటేమిటి అన్నీ స్త్రీ మూర్తి రూపాలే మనకు స్పురణకు వొస్తాయి .కారణం ఆయన చిత్రాలకు ప్రధాన వస్తువు స్త్రీ మూర్తి కాబట్టి. కుటుంభంలో ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా , భార్యగా, ప్రియురాలిగా ఇలా బిన్న విభిన్న పాత్రలు పోషిస్తున్న స్త్రీ మూర్తిని ప్రకృతి మరియు కుటుంభం తో తనకు గల అనుభందాన్నిఅత్యంత హృద్యంగా రమణీయముగా వీరు చిత్రాలలో చూపిస్తారు . స్వతస్సిద్దంగా స్త్రీ మూర్తి నందు వుండే ప్రేమ, కరుణ, వాత్సల్యం ,దీక్ష ,పట్టుదల మొదలైన ఆమె యొక్క భావాలను అనుభవాలను అనుభూతులను, తనదైన చిత్రణా పద్ధతుల ద్వారా చూపించిన వీరిరచనా శైలి వీక్షకుల మానసానికి హత్తుకునేలా వుంటుంది . దీనికి కొంత ప్రేరణ తన గురువు కొండపల్లి శేషగిరి రావు గారు అయితే అయి వుండవోచ్చేమో , కాని రూపశిల్ప నిర్మాణంలో ఇద్దరికి స్పష్టమైన తేడా మనకు కనిపిస్తుంది. సిరాజుద్దీన్ గారు తీర్చి దిద్దిన అమ్మాయిల ముఖాల్లో కళ్ళు ముక్కు నోరు తదితర బాగాలు సాదారణ బొమ్మల్లో కనిపించే సమతలంగా కాకుండా సజీవ శిల్పంలోలా వాస్తవికత వుట్టిపడుతుంది , అనగా ఒకింత త్రీడి రూపంలో కనిపిస్తాయి , అవి సంతకం కూడా అవసరంలేకుండానే మేము సిరాజుద్దీన్ చే సృష్టించబడ్డ వాళ్ళమని చెప్పుకుంటాయి . అంతలా తన మార్కు వీరి చిత్రాలలో కనబడుతుంది .
సిరాజుద్దీన్ గారి చిత్రాలు అనగానే “లోటస్ పాండ్స్ “అనే సిరీస్ లో వేసిన సుందర లతాంగులే కొందరికి గుర్తుకు వొచ్చినప్పటికి ఆయనింకా “స్ట్రీట్ బెగ్గర్స్ “ హౌస్ ఇంటీరియర్స్ అండ్ ఎక్షటీరియర్స్” విమెన్ విత్ నేచర్ “లోటస్ పాండ్స్” ఇలా వరుసగా పలు సిరీస్ లలో ఎన్నో చిత్రాలు సృష్టించారు .ప్రస్తుతం మరింత నవ్యత్వంతో శాకుంతలం సిరీస్ ని సృష్టిస్తున్నారు. జల , ఎక్రలిక్ , మరియు తైల వర్నాలు ఇలా ఎన్ని మాధ్యమాలలో చిత్ర రచన చేసినప్పటికీ జలవర్నచిత్రాలే వీరి ప్రతిభకు గీటు రాయిగా నిలుస్తాయి.
చిత్రకళా గంధం ఏమాత్రం లేని కుటుంభంలో నెల్లూరు జిల్లాలో శ్రీమతి హుమేరాబేగం, షాబుద్ధిన్ అనే దంపతులకు 1965 జూలై 25 తేదీన సిరాజుద్దీన్ జన్మించారు .చిన్న తనం నుండే చిత్రకళపై ఆసక్తి ని కనబరిచిన సిరాజుద్దీన్ ని పదవతరగతి పూర్తయిన పిదప డ్రాయింగ్ లోయర్ హయ్యర్ పరీక్షలలో ఉత్తీర్ణుడై ఆపై పేపర్ లో వొచ్చిన ఒకప్రకటన ద్వారా బి ఎఫ్ ఏ గురించి తెలుసుకొని రాసిన ఎంట్రన్స్ లో రాంక్ సాధించి హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరారు . 1991 నాటకీ బి ఎఫ్ ఏ పూర్తి అయిన పిదప 1992 లో నెల్లూరు నందలి DKW కళాశాలలో ఒక సంవత్సరం పాటు చిత్రకళాపాటాలను భోదించారు , ఆపై 1993 నుండి 2003 వరకు స్వర్గీయ మాజీ ప్రధాని పి వి నరసింహారావు గారి పుత్రిక మరియు చిత్రకారిణి అయిన శ్రేమతి సురభి వాణీదేవి గారు హైదరాబాదు నందు స్థాపించిన శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల నందు చిత్రకళ లో పెయింటింగ్ విభాగానికి అధిపతిగా సేవలందించారు ,పదకొండేళ్ళ చిత్రకళా ఆచార్యకత్వంలో ఎందరో చిత్రకారులను వీరు తయారు చేసి ఎందరికో మంచి భవిష్యత్తును అందించారు.
చిత్రకారుడిగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న కాలంలోనే గుంటూరు నుండి నవరంగ్ చిత్రకళా నికేతన్ అవార్డ్ , 1989 లో JNTU కళాశాల వార్షిక అవార్డ్ ను 1990,1997,2000 ,2001 లలో లో ప్రఖ్యాత హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి పలు అవార్డ్స్ 1999లోభారత్ కళా పరిషద్ అవార్డ్ 2002లో, న్యూ ఢిల్లీ స్టేట్ అవార్డ్ 2003 లో ICCR స్టేట్ అవార్డ్ ఇంకా కోనసీమ చిత్రకళా పరిషత్ నుండి పలు అవార్డులతోపాటు “ చిత్రకళా వైజయంతి” పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
వ్యక్తి గతంగా 1990 లో నెల్లూరు లో ప్రారంభమైన అతని ప్రదర్శనలు 2001లో హోటల్ గ్రాండ్ కాకతీయ హైదరాబాద్, 2003లో సృష్టి ఆర్ట్ గాలరీ , 2003, 2004, 2005, 2006 సంవత్సరాలలో సృష్టి ఆర్ట్ గాలరి హైదరాబాద్ బెంగుళూరు, చెన్నై, తదితర ప్రదేశాలలో వ్యక్తిగత ప్రదర్శనలు చేయడంతో పాటు 1990 నుండి 2017 వరకు ఢిల్లీ బొంబాయి, చెన్నై, కేరళ, కలకత్త ,హైదరాబాద్, రాజమండ్రి తదితరమైన చోట్ల ఎన్నో సామూహిక ప్రదర్శనలు చేసారు,అంతే గాక మరెన్నో వర్క్ షాపులలో పాల్గొని తనదైన రమణీయ చిత్రాలను వేయడం జరిగింది. నెల్లూరు నందు సింహపురి ఆర్ట్ అకాడమి వ్యవస్థాపకుల్లో శ్రీ సిరాజుద్దీన్ ఒకరు కావడం విశేషం.
రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో ప్రధర్సనలు చేసి ఎందరో గొప్ప కళాకారులు మరియు రాజకీయంగా కూడా గొప్పగొప్ప స్థాయిలో వున్న వ్యక్తులకు చాల దగ్గరగా ఉండడమే గాక వారి ప్రశంసలకు కుడా ఎంతో గొప్పగా నోచు కున్న వీరు దానికి తగిన స్థాయిలో ఆర్ధికంగా నిలదోక్కుకోలేకపోవడం దురదృష్టకరం. ఇటీవలనే నేను వారిని పరిచయం చేసే నిమిత్తం హైదరాబాద్ నందలి మియాపూర్ దగ్గర మదీనా గూడలో ఉంటున్న సిరాజ్ గారిని కలవడం వారి అందమైన చిత్రాలను వీక్షించడం జరిగింది , అద్భుతమైన కళా సంపదను సృష్టించుకున్న ఆ చిత్రకారుడి స్థాయికి తగినరీతిలో అతని ఆర్ధిక స్థాయి నాకు కనిపించలేదు సరికదా కాస్తంత ధైన్యస్తితి లోనే వున్నట్టు వారి మాటలద్వారా వ్యక్తమయ్యింది .ఒక సాదారణ స్థాయి నుండి ఒక మహా నగరంలో కాలు పెట్టి తన స్థాయిని మించి ధృడమైన సంకల్పంతో చిత్రకళ విద్యను నేర్చి అప్పటికి రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రముఖుల వద్ద స్థానం సంపాదించడం ఎక్కడో దూరంగా వున్న తన పల్లె వాసులకు ఎంతో గొప్పగా గౌరవంగా అనిపిస్తుంది కాని ఈ చిత్రకారుడి సామర్ధ్యం కొందరి గోప్పవారికి ఉపయోగపడిన స్థాయిలో ఆ పరిచయాలు అంతగా వీరికి వుపయోగపడకపోవడం దురదృష్టకరం అయినప్పటికీ మొక్కవోని దీక్షతో తాను జీవితకాలంలో నిలుపుకున్న చిన్న అపార్ట్మెంట్ లో నేటికి తన కళా సృజన సాగిస్తూనే వున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో చిన్న ఉద్యోగం చేస్తున్న తన కొడుకు ఆర్జన నేటికీ తన జీవన యాత్ర, కళా యాత్ర కొనసాగడానికి కారణం అని చెప్పినప్పుడు నిజంగా విస్తుపోవడం నా వంతయ్యింది.
కళ కళ కోసం , లేదా సమాజం కోసం అనే రోజులు పోయీ కళ తనకోసం తన మనుగడ కోసం అనుకునే రోజులివి. మారుతున్న కాలంలో ప్రతీది ద్రవ్యంతో ముడిపడివున్న నేటి రోజుల్లో ఇది అత్యంత ఆవశ్యకం కుడా . అందుకే
కళ ను సృష్టించడం వేరు , ఆ కళతో ధనాన్ని సృష్టించడం వేరు
సృజన కారులందరూ గొప్ప కళాకారులు కావొచ్చు … కాని
గొప్ప కళాకారులందరూ గొప్పఆర్జించేవారు కాలేరు . అలాగే
ఆర్జన పరులందరూ గొప్ప కళాకారులు కావాలని లేదు
అది వ్యక్తి యొక్క కృషి అధ్రుస్టం పై ఆధారపడి వుంటుంది.
సిరాజుద్దీన్ గొప్ప చిత్ర కళాకారుడు కాని ఆ కళను కాసులలోకి మార్చుకోలేని నిస్సహాయుడు .అందుకే తన కళకు తగిన గుర్తింపు ఆర్ధికంగాను హార్దికంగాకుడా రావాలి అంటే ఆయన బొంబాయి కలకత్త , న్యూ ఢిల్లీలాంటి నగరాలలోని జహంగీర్ ఆర్ట్ గేలరీ లాంటి ప్రఖ్యాత గెలరీల్లోప్రదర్శనలు చేయాలి .అప్పుడే వీరి కృషికి తగిన గుర్తింపు వొస్తుంది . ఆ దిశగా కళా యాత్ర ముందుకు సాగాలని సాగుతుందని ఆశిద్దాం.
– వెంటపల్లి సత్యనారాయణ
ధన్యవాదములు మిత్రమా సిరాజ్ ఫై నేను రాసిన ఆర్టికల్ మీకు నచ్చినందుకు. సిరాజుద్దీన్ ఒక అద్భుతమైన ప్రతిభ గల చిత్రకారుడు .అతనిచిత్రాలు చుసిన ఎవరికైనా ఒక సుందరమైన రంగుల వనంలో విహరించిన అనుభూతి కలుగుతుంది .నేను పై ఆర్టికల్ రాయడంలో భాగంగా వారి ఇంట్లో అతని orijinal చిత్రాలు చూసినప్పుడు నేను ఇదే అనుభూతి చెందాను .కానీ అతని ప్రతిభకు తగిన స్థాయిలో గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది డం నా రూప చిత్రాన్ని kudaకేవలం పది నిముషాలలో వేసి నాకు గిఫ్ట్ గ ఇచ్చారు . సిరాజుద్దీన్ గారి వొద్ద అద్భుతకళాసంపద వుంది చిత్రకళాభిలాషులు ఎవరైనా వాటిని కొనుగోలు చేస్తే బాగుంటుంది.
64 కళలు.కామ్.కళాసాగర్ గార్కి కృతజ్ఞతలు
ఆర్టిస్ట్ సిరాజ్ గార్కి నమస్కారములు.
(నా పేరు హరనాథ్ నేను ఆర్టిస్ట్ ని నాది సొంతవూరు నెల్లూరు.)చిత్రకళకు ఆకర్షితుడు అయి, అభ్యసించి,వృత్తిగా స్వీకరించి, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సంపాదించుకొని, ఎంతోమందికి గురువు అయి, పేరు గాంచిన కళాశాలలో ఆధ్యాపకునిగా పని చేసి,స్త్రీ మూర్తి గురించి
ఆదర్సాబావలతో చిత్రాలను చిత్రించి సజీవుగా సమాజానికి అందించిన సిరాజ్ గార్కి హృదయపూర్వక అభివనందనలు.
ఇట్లు మీ
స్నేహితుడు.నెల్లూరియుడు.కళాకారుడు.
హరనాథ్.
Thanks Haranath garu
its very nice article
The paintings of artist sirajuddin and the article written by ventapalli satyanarayana is so nice congratulations to artist sirajudin and writer ventapalli
Thank you so much
సిరాజుద్దిన్ గారు లాంటి అద్భుతమైన చిత్రకారుని పరిచయభాగ్యం కలిపించారు.ధన్యవాదాలు .
Thank you sir kannaji rao garu
Article is too beautiful
Thank u so much sir-ventapalli satyanarayana
Please inform the address of Srijuddin , at Madinaguda. I am staying at Atlantic City apprtments opposite to Andhra Bank ,Madinaguda. I am retired ,Chief manager of Andhra Bank, I am also artist,. I saw your water colour paintings they are nice
Thanks for your response Prasad Bhuvanagiri garu .I am ventapalli satyanarayana writer of sirajuddin article. from last 8 years i am introducing various artists those who are seriously working in art field .100 artists were introduced by me so far through this web site http://www.64 kalalu.com
This is the SIRAAJUDDIN mobile number -9553918530 please call him once for further details
Excellent works, congrats to artist.
సత్యం కటువైనది. నిజం నిష్టూరం. చిత్రకారులు తృప్తి తో బతుకుతారు గానీ, డబ్బు సంపాదించడంలో మాత్రం విఫలురే వెంటపల్లి గారు… మంచి కళాకారుడిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
అవును సర్ మీరు చెప్పింది అక్షర సత్యం
విలువైన మీ స్పందనకు ధన్య వాదములు సర్
Nice article about great artist.
Thank you so much sir
Thank you so much sir
Excellent
Thank you friend
Nice
Thank u sir
సిరాజుద్దీన్ గారి కళా నైపుణ్యం వెంటపల్లి గారి మాటల్లో బాగా అర్ధం చేసుకునేలా వుంది.
ధన్యవాదములు రాంబాబు
సత్యన్నారాయణ గారు, సిరజుద్దీన్ గారిపై మీ article చాలా బాగుంది. ఒక మంచి కళాకారుని వివరాలను చాలా చక్కగా అందజేశారు.
చక్కటి మీ స్పందకు ధన్యవాదములు మేడం లతా గారు
He is a real artist..
YES IT IS TRUE SANJAY GARU
Really he is a great artist. I saw his original paintings.
Yes venkata aachari garu .where from you sir are you a painter…?
Hot women crave sex in your city: http://www.lookweb.it/adultdating77776828
Hot women in your city crave sex: http://wntdco.mx/bestadultsites73863
Hot women crave sex in your city: https://tinyurl.com/adultdating77771638
Hot women in your city crave sex: https://x0.no/42t4g
Hello! You won $ 1950 today, I’m sure of that.
Because it is a bitcoin win-win lottery!
One cryptocurrency multimillionaire who wished to remain incognito organized it.
You just need to send 0.05 bitcoins to the specified wallet and within 3 hours 0.35 bitcoins will come to your wallet that equals $ 1950.
You can participate once a day. The lottery will be held until November 25, 2018.
Hurry up to get your $ 1950 for this day. Send 0.05 bitcoins to the selected wallet for your game: 1FFC64PDwbosT8RLNrKHyRrJxc9KNwUXLP
What’s the easiest way to earn $3000 a month: http://2url.de/3000perday362413
I’m 23. I have $3000. How can I best use it to make more money: https://www.trim.li/3000perday773184
Top 10 Ways To Meet Hot Women: https://www.trim.li/bestadulthotwomans511927
Fuck tonight juicy woman in your town: http://s.workflowfaq.com/bestadultdating2837459507
Simple biz + new tool = $150 per hour: http://freest.at/MAKEMONEY500056627
Find a hot woman for good sex in your town: http://tans.me/99936481
HeiГџe Frauen fГјr guten Sex jeden Tag: http://www.short4free.us/bestadultdatinginyourcity61018
Fuck tonight juicy woman in your town: http://rih.co/96622
Wie man aus € 3.000 € 128.000 macht: http://rih.co/bestinvestsystem39141
How to make $10,000 Per day FAST: http://www.lookweb.it/bestinvestsystem32975