తెలుగు సిని స్వర్ణ యుగానికి సంబంధించిన ఏ సంగతులు అయిన ఈనాటి వారికి ఎంతో అపురూపమైనవే. తెలుగు సినిమా తొలి దశలో సినీ నిర్మాణానికి నిర్దిష్టమైన బాటలు పరిచిన ప్రతిష్ఠాత్మక సినిమా సంస్థ వాహినీ ప్రొడక్షన్స్. శ్రీ మూలా నారాయణస్వామి గారు, శ్రీ బి.ఎన్ రెడ్డి గారు మరికొందరు మిత్రులు కలిసి లాభార్జనే ముఖ్యం కాకుండా డబ్బులతో పాటు సామాజిక బాధ్యతను కూడా భుజానికెత్తుకొని ఈనాటికీ చెప్పుకునే విలువల్ని పాటించినది వాహినీ ప్రొడక్షన్స్. ఇలా వాహిని పుట్టుక, వాహిని నిర్మించిన సినిమాలు ,వాటి వెనుకనున్న ఎన్నో సంగతులను సవివరమైన- సలక్షణమైన రచనతో శ్రీ రావి కొండల రావు గారు ప్రతిష్ఠాత్మక సినిమా సంస్థ వాహిని అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఒకసారి చదవడం మొదలుపెడితే పూర్తి చేసే వరకు వదలని విధంగా పుస్తకాన్ని రచించారు. ముచ్చటైన ముఖచిత్రంతో అందమైన క్వాలిటీ పేపర్ తో ఈ పుస్తకం ప్రచురించబడింది పాత సినిమా ప్రేమికులు తప్పక కొని దాచుకోదగ్గ పుస్తకం. వెల రెండు వందల రూపాయలు. కావాలనుకున్నవారు స్వయంగా రావి కొండలరావు గారు దగ్గరుండి పొందవచ్చు. లేదా దగ్గరలో ఉన్న నవోదయ విశాలాంధ్ర పుస్తక విక్రయశాల లో కొనుక్కోవచ్చు.
అయితే స్వయంగా తమ ఇంటి వద్దకే ఈ పుస్తకం కావాలనుకున్నవారు పోస్టల్ ఖర్చులను భరించవలసి ఉంటుంది.
రావి కొండలరావు. రచయిత సెల్ : 91 9848071175