‘రాముడి’గా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ

ప్రభాస్ కథానాయకుడిగా ‘ఆదిపురుష్’ త్రీడీ చితం …

రెబెల్ స్టార్ ప్రభాస్ కి తెలుగులోనే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు అభిమానులు ఉన్నారు.  ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే తన అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయిపోయాడు. ఇప్పటికే రాథే శ్యామ్ గా అతి త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్న ప్రభాస్ తన 22వ సినిమాకి సంబంధించిన ఆశక్తికరమైన వివరాలు అధికారికంగా ప్రకటించాడు.
మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు డికేడ్ బిగెస్ట్ అనౌన్స్మెంట్  ప్రకటించారు.

‘రాముడి’గా ప్రభాస్
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరావత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. ‘చెడుపై మంచి సాధించే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అని హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓంరావత్ అధికారికంగా ప్రకటించారు. టీసిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రూ.350 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మితం కానుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించనుండటం విశేషం. రామాయణంలోని కీలక ఘట్టాల ఆధారంగా ‘ఆదిపురుష్’ను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. పోస్టర్లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేయడం ద్వారా సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి రాముడిగా కనిపిస్తారని అనుకోవచ్చు. మరి రావణాసురుడు, హనుమంతుడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ప్రకటనలో ఎక్కడా తాము రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పకపోవడం గమనార్హం. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. మరో వైపు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. ఈ రెండు చిత్రాలను పూర్తి చేస్తే కానీ.. తన 22వ చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ స్టార్ట్ చేయలేరు. 2022 ద్వితీయార్థంలో లేదా 2023లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎపిక్ డ్రామాకి వియఫ్ఎక్స్ హంగులు
సాహో, రాథే శ్యామ్ తరువాత వరసగా మూడో సారి ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి. సిరీస్ తో కలిసి పని చేస్తున్నారు ప్రభాస్. ఆది పురుష్ ఓ ఎపిక్ డ్రామాగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవ్వబోతున్నట్లుగా టి. సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు.

ఎవరీ రౌత్ ?
కేవలం రెండు సినిమాల అనుభవం అతన్ని 350 కోట్ల బడ్జెట్ సినిమాకు దర్శకున్ని చేసిందంటే అతని ప్రతిభ ఏమిటో తెలుస్తుంది.  ఓం రౌత్ ఒక భారతీయ చిత్ర దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. ముంబై లో పుట్టిన రౌత్, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఎం.టీవీ. నెట్వర్క్ లో రచయితగా కెరీర్ ప్రారంభించాడు. మరాఠీ మరియు హిందీ సినిమా రంగంలో మంచి దర్శకునిగా గుర్తింపు పొందాడు.
2015 లో అతని దర్శకత్వంలో రూపొందించిన మొదటి చిత్రం లోక్మాన్య- ఏక్ యుగ్ పురుషష్ విడుదలై ఉత్తమ తొలి దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఇండియన్ పనోరమ విభాగంలో ఎన్నికై ప్రదర్శించబడింది. ఓం రౌత్ సిటీ ఆఫ్ గోల్డ్ మరియు హాంటెడ్ – 3 డి వంటి చిత్రాలను కూడా నిర్మించారు, ఇది భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3 డి చిత్రం. జనవరి 2020 లో విడుదలైన అతని చిత్రం తన్హాజీ 3 డిలో కూడా లభిస్తుంది.

టెక్నికల్ డీటెయిల్స్
బ్యానర్ : టి సిరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫైల్స్ ప్రొడక్షన్స్
సమర్పణ : గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
డైరెక్షన్ : ఓం రౌత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap